పెండింగ్ ధరణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ధరణి దరఖాస్తులను 15 రోజులలో పరిష్కరించాలి..
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్.
సూర్యాపేట, అక్షిత ప్రతినిధి:
శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ సమావేశం మందిరం నందు పెండింగ్ ధరణి సమస్యల పరిష్కారం పై జిల్లా కలెక్టర్ ఆర్డీవోలు తాసిల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి వివిధ మాడ్యుల్స్ లో దాఖలైన దరఖాస్తులను తొందరగా పరిష్కరించాలని సంబంధిత ఆర్డీవోలకు, తాసిల్దార్లకు కలెక్టర్ సూచించారు. రెండు వారాలలో పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. కోర్టు కేసులు, లోకాయుక్త కేసులో ఉన్న వాటిపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. సీఎం ప్రజావాణి,జిల్లా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను పరిశీలించి శాఖల వారీగా పరిష్కరించాలన్నారు మండలాల వారిగా ధరణి దరఖాస్తుల పెండింగు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ధరణి ధరణి దరఖాస్తులను పరిశీలించకుండా తిరస్కరించవద్దని కలెక్టర్ తెలిపారు తిరస్కరణకు గల కారణాలు కూడా దరఖాస్తుదారునికి తెలపాలని కలెక్టర్ సూచించారు రెవెన్యూ డివిజన్ల వారీగా గ్రామాలలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా వాహనాలను సీజ్ చేసి ఆర్డిఓ ద్వారా జిల్లా కలెక్టర్కు నివేదిక పంపాలని తాసిల్దార్లకు కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బి ఎస్ లత,ఆర్డీవో లు. సిహెచ్ సూర్యనారాయణ,డి శ్రీనివాస్లు, వేణు మాధవ్ రావు, మండల తాసిల్దార్లు శ్యామ్ సుందర్ రెడ్డి ,ఆంజనేయులు,, సంఘమిత్ర, హేమమాలి, అధికారులు
,పాల్గొన్నారు.