జర్నలిస్టులుగా సంక్షేమ
పథకాలను ప్రజలకు చేరేలా చూడాలి
– నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
– ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్ కు ఘన సన్మానం
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ప్రభుత్వం ప్రజల కోసం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేలా జర్నలిస్టులు కృషి చేయాలని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కోరారు. నల్గొండ మొట్టమొదటి మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని సోమవారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్లగొండలోని ఆమె నివాసంలో శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్టులు కృషి చేయాలని, కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ప్రజా సంక్షేమంతో పాటు నల్లగొండలో సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని అందులో జర్నలిస్టుల భాగస్వామ్యం కూడా అవసరం అన్నారు. ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న జర్నలిస్టుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్, టీయూడబ్ల్యుజే 143 అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్ మాట్లాడుతూ నల్గొండ కార్పొరేషన్ అభివృద్ధికి జర్నలిస్టులుగా తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాలని మంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టులకు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్టులు వెంకట్ రెడ్డి, అల్లి మల్లికార్జున్ యాదవ్, దండంపల్లి రవికుమార్, ఉబ్బని సైదులు, నీలం వెంకటమధు, రెడ్డిపల్లి యాదగిరి, పిల్లలమర్రి శ్రీనివాస్, ముచ్చర్ల విజయ్, ముచ్చర్ల శ్రీనివాస్, కారింగు శ్రీనివాస్, చింత యాదగిరి, రవిశంకర్, వినోద్, రమేష్, పెద్దగోని మధు, పామనగుండ్ల నవీన్,భోగరి రామకృష్ణ, ఓడపల్లి మధు, రవి, కత్తుల హరి, కట్ట యాదయ్య, పెరుమాళ్ళ విజయ్ కుమార్, జానీ, నవీన్ గౌడ్, రామకృష్ణ, శివ, రవి తదితరులు ఉన్నారు.