ఐక్యతతోనే అభివృద్ధి
పాలేరు నియోజకవర్గం ముదిగొండ ప్రాంతీయ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీస్ ప్రారంభం
–ఆఫీస్ ప్రారంభించిన పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ దయాకర్ రెడ్డి
ఖమ్మం/అక్షిత బ్యూరో :
పాలేరు నియోజకవర్గం ముదిగొండ ప్రాంతీయ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీస్ ని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్డు వద్ద నూతన కార్యాలయాన్ని పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పఠాన్ యాకుబ్ షావలి (పాషా) కార్యదర్శి వల్లభనేని సాయిచరణ్ ఉపాధ్యక్షులు బెక్కం కనకయ్య కోశాధికారి
రుద్రగాని మాధవరావు కన్వీనర్ మామ సిరాజ్ లు తమరు దయాకర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో గ్రానైట్ రైస్ వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిందని ఐక్యమత్యంతో లారీ అసోసియేషన్ అభివృద్ధి సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో అస్సోసియేషన్ వారు ముఖ్య అతిధులను శాలువా తో సత్కరించి మూమెంటో ను అందించారు.ఈ కార్యక్రమం లో మద్ధులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు ఏదులాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ గ్రానైట్ అస్సోసియేషన్ సెక్రెటరీ కమర్తపు గోపాలరావు ఖమ్మం జిల్లా గ్రానైట్ మార్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కిషన్ జానీమియా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ నేలకొండపల్లి మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న అంబటి సుబ్బారావు మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు వెంపటి వెంకన్న గుర్రం రాకేష్ రెడ్డి భద్రా చారీ తదితరులు పాల్గొన్నారు.