“అటు నేనే… ఇటు నేనే”
సర్పంచ్ పదవి కవచంగా ఇసుక దందా?
ఇసుక క్వారీలో సర్పంచ్ అధికార దుర్వినియోగం?
సర్పంచ్ కుటుంబం కోట్లు దండుకుంటుందా?
మాజీ–ప్రస్తుత సర్పంచ్‌లపై తీవ్రమైన ఆరోపణలు
భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత బ్యూరో :
సహకార సంఘాల పేరును అడ్డుపెట్టుకొని ఇసుక ర్యాంపుల నిర్వహణలో కోట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు మణుగూరు మండల పరిధి లోని ఒక గ్రామ పంచాయతి మాజీ సర్పంచ్, ప్రస్తుత మహిళా సర్పంచ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ పంచాయతీ పరిధిలో నడుస్తున్న ఇసుక క్వారీ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.
“అటు నేనే… ఇటు నేనే” వ్యవహారం?
ప్రస్తుతం సర్పంచ్‌గా ఉన్న మహిళా ప్రజాపతి నిధి , అదే సమయంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక క్వారీకి సంబంధించిన సొసైటి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఒకే వ్యక్తి రెండు కీలక పదవుల్లో ఉండటం ద్వారా పారదర్శకత లోపిస్తున్నదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇటు సర్పంచ్ గా అటు ఇసుక క్వారీ సొసైటీ ప్రెసిడెంట్ గా వుండటం, త్రీవ్వ చర్చగా మారింది.ఇసుక రవాణా, టెండర్లు, లీజు ఒప్పందాలు వంటి అంశాలలో స్పష్టత లేదని గ్రామ ప్రజలు విమర్శిస్తున్నట్టు సమాచారం.
మాజీ సర్పంచ్ పై కూడా అనుమానాలు
గతంలో అదే పంచాయతీలో సర్పంచ్‌గా ఉన్న ఆమె భర్త అనేక అక్రమాలకు పాల్పడ్డాడనే విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వస్తోంది. ఇసుక ర్యాంపుల నుంచి భారీగా ఆదాయం వచ్చినప్పటికీ, గ్రామ అభివృద్ధికి ఆ నిధులు వినియోగించలేదని ఆరోపణలు ఉన్నాయి.గ్రామస్థులు చెబుతున్న ప్రకారం, పంచాయతీ ఆదాయ, వ్యయాలపై పూర్తి స్థాయి ఆడిట్ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
నడి గోదావరిలో రోడ్ల నిర్మాణం?
సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక ర్యాంపు కోసం నడి గోదావరిలో తాత్కాలిక రోడ్లు నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్మాణాలకు సంబంధించి గ్రామ సర్పంచ్, సోసైటి అధ్యక్షురాలు అయిన ఆమె అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.పర్యావరణ నిబంధనలు, నది పరిరక్షణ చట్టాలు ఉల్లంఘిస్తున్నారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
అధికారుల స్పందన ఏమిటి?
ఈ వ్యవహారంపై సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పంచాయతీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సహకార సంఘాల పేరుతో వ్యక్తిగత , కుటుంబ లాభాల కోసం అధికార దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పారదర్శకత అవసరం
ఇసుక ర్యాంపుల నిర్వహణలో పారదర్శక విధానం, ఆదాయ,వ్యయాల వివరాల బహిరంగ ప్రకటన, గ్రామ సభలో చర్చ తప్పనిసరి చేయాలని సర్పంచ్ గా ఇసుక క్వారీ సోసైటి గా ఆమె ఉంటు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
సహకార సంఘాల లక్ష్యం గ్రామ అభివృద్ధే కానీ, వ్యక్తిగత లాభాలు కాదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.అక్రమంగా నడుస్తున్న ఆ సొసైటీని తక్షణమే రద్దు చేయాలని సొసైటీని అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయలు లబ్ధి పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.