పారిశుధ్యం మెరుగుకు కృషి
మారుతినగర్, హౌజింగ్ బోర్డు
కాలనీల్లో పర్యటించిన మేయర్ కోలగాని శ్రీనివాస్
కరీంనగర్, అక్షిత బ్యూరో :
నగరంలోని అన్ని డివిజన్లలో పరిసరాలను పరిశుభ్రంగా మార్చి పారిశుధ్య పనులను మరింత మెరుగు పరచాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులు, కార్మికులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుధ్య నిర్వాహణలో భాగంగా శుక్రవారం 7వ, 36 వ డివిజన్ లలో మేయర్ పర్యటించారు. మొదటగా 36 వ డివిజన్ లో కార్పోరేటర్ తోట అనిల్ తో కలిసి మారుతినగర్ జెండా చౌరస్తా వద్ద పారిశుధ్య కార్మికుల హాజరు రికార్డును తనిఖీ చేశారు. పారిశుధ్య అధికారులు, కార్మికులు పారిశుధ్య పనులు చేపడుతున్న తీరు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య పనుల నిర్వహణపై కార్మికులకు పలు సూచనలు చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకు రావాలని కార్మికులకు సూచించారు. అనంతరం 7 వ డివిజన్ హౌజింగ్ బోర్డులో కార్పోరేటర్ ఆకుల నందిని ఉదయ్ తో కలిసి పాదయాత్ర ద్వారా వీధుల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేసి పరిశీలించారు. పలు కాలనీల్లో పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేస్తున్న కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హౌజింగ్ బోర్డులో స్థానికంగా రెండు పార్కులను సందర్శించారు. పార్కులో వాకర్ల సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. వాకర్లు మేయర్ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నగర పారిశుద్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు కార్మికులు, అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్మికులు, సిబ్బంది ప్రతి రోజు విధులకు తప్పక హాజరై పరిసరాలను పరిశుభ్రం చేయాలన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులకు జవానులు, సానిటరీ ఇన్స్పెక్టర్ లు స్పందించి వెను వెంటనే సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు అవసరాలను బట్టి కావల్సిన పనిముట్లు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ల వారిగా స్వచ్చ్ ఆటో వాహానాలు ప్రతి ఇంటి నుండి చెత్తను వేరు వేరుగా సేకరించేలా జవానులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఉదయం పారిశుధ్య పనులు కొనసాగే సమయంలో జవానులు, సానిటరీ ఇన్స్పెక్టర్ లు, ససూపర్ వైజర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. స్వచ్చ్ ఆటోలు, ట్రాక్టర్ వాహనాల ద్వారా చెత్తను ఎప్పటికప్పుడు డీఆర్ సీసీలు, డంపు యార్డుకు తరలించాలన్నారు. సెక్రిగేషన్ ప్రక్రియ ను తప్పక పాటించి డంపు యార్డుకు వెల్లే చెత్తను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి స్వచ్చ్ ఆటోలో తడి, పొడి చెత్తకు సంబంధించి పార్టేషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎక్కడ జీవిపి, గార్బేజ్ పాయింట్ల వద్ద చెత్త కనబడకుండ చూడాలని, గార్బేజ్ పాయింట్ల వద్ద చెత్త పడకుండ జవానులు బాధ్యత వహించాలని ఆదేశించారు. డివిజన్లలో కార్మికులను సర్దుబాటు చేస్తూ పారిశుధ్య పనులు సక్రమంగా జరిగేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డివిజన్లలో పార్కులను కూడ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, పార్కులలో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించాలన్నారు. వాకర్లు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కుల నిర్వహణ చేపట్టాలన్నారు. డివిజన్ లలో డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ఓపెన్ డ్రైనేజీలు ఉన్న చోట చెత్త, సిల్టును తొలగించి మురుగు నీరు నిలువకుండ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా రెండు లేక మూడు డ్రైనేజీలు ఓకే చోట కలిసే జంక్షన్ వద్ద, కల్వర్టుల వద్ద చెత్త పేరుకు పోకుండ చూడాలని, చెత్త, సిల్టును ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. డివిజన్ లలో పారిశుధ్యం మెరుగ్గా ఉంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, ఆదిశగా పారిశుధ్య అధికారులు, సిబ్బంది, కార్మీకులు పారిశుధ్య పనులు చేయాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మికులు కూడ తమ ఆరోగ్యం పట్ల కూడ శ్రద్ద వహించాలని పనులు చేసే సమయంలో నగరపాలక సంస్థ ద్వారా అందించిన ఆఫ్రాన్ లు, చేతులకు గ్లౌజులు, బూట్లు తప్పక ధరించాలన్నారు. తెల్లవారు జామున రోడ్లను శుభ్రపరిచే సమయం కారర్మికులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పారిశుధ్య పనులపై సూపర్ వైజర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్ లు, జవానులు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత సమస్యను వెంటనే పరిష్కరించేలా పారిశుధ్య కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు తోట అనిల్, ఆకుల నందిని ఉదయ్, ఎంహెచ్ఓ సుమన్, సానిటేషన్ సూపర్ వైజర్ శ్యామ్ రాజ్, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, జవానులు, మాజీ కార్పోరేటర్ ఆకుల పద్మప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.