కొత్త రేషన్ కార్డులు ప్రక్రియను మొదలుపెట్టాలి..

కొత్త రేషన్ కార్డులు ప్రక్రియను మొదలుపెట్టాలి..

ఏటి ఆంజనేయులు
కంటెస్టెండ్ ఎంపీ మెదక్ పార్లమెంట్*

నంగునూరు, అక్షిత ప్రతినిధి:

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ ఉపాధ్యక్షులునంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో మెదక్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసిన ఏటి ఆంజనేయులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామానికి కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదాని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పట్ల వివక్ష చూపి ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకుండా చేసిందని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజులు అవుతున్న ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డుల ఊసులేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలలో రేషన్ కార్డుల గ్యారంటీ ప్రక్రియను ఎందుకు ప్రారంభించడం లేదని గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన లేకుంటే రాష్ట్రంలోని కొత్తగా వివాహం చేసుకున్నవారు అలాగే రేషన్ కార్డులో నమోదు చేసుకొని పేరులు ఇంకా రేషన్ కార్డులలో నమోదు చేసుకునే ప్రక్రియను మొదలు పెట్టనట్లయితే రాష్ట్రంలోని ఎంతోమంది కుటుంబాలు తినడానికి తిండి లేక ప్రభుత్వ పథకాలకు అందుబాటులో లేక వారు ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజల పట్ల చిత్తశుద్ధితో రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking