మండల ప్రధాన కార్యదర్శిగా సానాది భాస్కర్ ఎన్నిక
చేర్యాల(కొమురవెల్లి) జులై 27 అక్షిత ప్రతినిధి: జనగామ పిసిసి అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సమక్షంలో శనివారం కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో లెనిన్ నగర్ గ్రామానికి చెందిన సానాది భాస్కర్ ను మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ నా పైన నమ్మకం తో కాంగ్రెస్ పార్టీ కొమురవెల్లి మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేసిన ప్రియతమ నాయకుడు డిసిసి అధ్యక్షులు,నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి కి మరియు మండల అధ్యక్షులు మహాదేవుని. శ్రీనివాస్ కు, నా ఎన్నికకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.