సమ్మేళనానికి ఆహ్వానం
అవకాశం దక్కడం సంతోషం
అస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత
అక్షిత న్యూస్ నెక్కొండ :
తమిళనాడులోని తిరువన్నామలైలో ఈనెల 22న జరిగే అంతర్జాతీయ హిందూ దేవాలయాల ఆధ్యాత్మిక జ్యోతిష్యుల సమ్మేళనానికి వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన వేద జ్యోతిష పండితులు బూరుగుపల్లి శ్రవణ్ శాస్త్రికి ఆహ్వానం అందింది.రెండవ అంతర్జాతీయ హిందూ దేవాలయాలు, ఆధ్యాత్మిక జ్యోతిష్యుల, ఆధ్యాత్మిక జ్యోతిష్య శాఖాదిధిపతుల సమ్మేళనంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేద జ్యోతిష ,వాస్తు పండితులు హాజరవుతున్నారన్నారు.వేద ఆధ్యాత్మిక జ్యోతిష విభాగంలో తనకు కూడా ఈ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని ఆదివారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఇండియన్ స్పిరిచువల్ వేదిక్ ఆస్ట్రాలజికల్ అండ్ వాస్తు రీసర్చ్ సెంటర్, ఇంటర్నేషనల్ టెంపుల్స్ స్పిరిచువల్ ఆస్ట్రాలజర్స్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్, నృసింహ ఉపాసకులు డాక్టర్ విశ్వనాథన్ నుంచి ఆహ్వానం అందినట్లు శ్రవణ్ శాస్త్రి తెలిపారు.తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ పూర్తి చేసి వేద జ్యోతిషం లో సేవలు అందిస్తున్న తనకు ఈ సంవత్సరంలో అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం రావడం ఇది రెండవ సారి అన్నారు.ఈ ఏడాదిలో ఇప్పటికే హైదరాబాదు,ఢిల్లీ సదస్సులకు హాజరయ్యానన్నారు.సనాతన భారతీయ సంప్రదాయంలో పేద జ్యోతిషం ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నదని,జాతీయ సమ్మేళనాలలో మరిన్ని తాజా అంశాలపై ఈ సమ్మేళనంలో నిష్ణాతులైన జ్యోతిష పండితుల నడుమ చర్చించే అవకాశం ఉంటుందన్నారు.ఇంటర్నేషనల్ అస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత ,జ్యోతిష వాస్తు బ్రహ్మ బిరుదాంకితులు శ్రవన్ శాస్త్రి తెలిపారు.