తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు హామీని ప్రభుత్వం నెరవేర్చాలి
–ఉద్యమకారులు మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలి
–తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుల ఐక్యవేదిక
ఖమ్మం /అక్షిత బ్యూరో :
తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సుల్తాన్ యాదగిరి ప్రధాన కార్యదర్శి ప్రపుల్ రాంరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న నేలకొండపల్లిలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించే కొట్లాడిన ఉద్యమకారుల పరిస్థితి దయనీయంగా మారిందని ఏ బతుకుదెరువు కోసం తాము బ్రతుకులను పణంగా బట్టి పోరాడేమో ఆ బ్రతుకులో చీకట్లో తప్ప వెలుగులు లేవని నడి నడిరోడ్డుపై నిలబడి కొట్లాడి తెచ్చుకుని తెలంగాణ ని తెలంగాణ ద్రోహులు కాంట్రాక్టర్లు చేతికి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.వాళ్లు సొంత సొత్తుగా అధికారం అనుభవిస్తుంటే ఉద్యమకారులు తెల్లబోయిన మోహాళ్ళతో చూడాల్సన పరిస్థితిని ఉందని అన్నారు. భారతదేశంలో స్వయంపాలనా కోసం అస్తిత్వ ఉద్యమాలు జరిగి ఏర్పడిన రాష్ట్రాలన్నీ ఉద్యమకారులను పూలల్లో పెట్టి చూసుకుంటుంటే చత్తిస్గడ్ ఉత్తరాఖండ్ ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యమకారులని గౌరవించుకుంటున్నారు. విద్యా వైద్య రంగాల్లో ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు. భూములు ఇంటి స్థలాలు కేటాయిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసిన కెసిఆర్ నియంత ప్రభుత్వం అంతమైంది.తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తానని మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా దాటవేత ధోరణి అవలంబిస్తుందని అన్నారు. ఏ తెలంగాణ కోసం అయితే బలిదానం సాధించుకున్నామో ఆ తెలంగాణ ఈనగాచి నక్కల పాలు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యమకారులపై ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాదాల శ్రీనివాసరావు కోయ వెంకట నారాయణ తీగల రాములు రామనాథం అఫ్జల్ అంగడి బిక్షం తోట వెంకటనారాయణ వడ్డేబోయిన వెంకటేశ్వర్లు అంబాల రామారావు వడ్త్యా రాజేష్ పాపయ్య చావా రమేష్ రామాంజనేయులు కల్వకుంట్ల లత చారి సత్యం తదితరులు పాల్గొన్నారు.