ప్రజా పాలన వేడుకకు సకలం సన్నద్ధం

*తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి….                       జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

*సూర్యాపేట, అక్షిత బ్యూరో :

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు రాకుండా మినిట్ టు మినిట్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించనున్న వేడుకలకు షెడ్యూల్ ప్రకారం వేడుకలు నిర్వహణ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇట్టి వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ వెనుకబడిన తరగతుల కమీషన్ ,చైర్మన్ జి. నిరంజన్ ను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఉదయం 10 గంటలకు ముఖ్య అతిథిచే జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు,సిబ్బంది ఉదయం 9 గంగలకు ఐడిఓసి కార్యాలయానికి హజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking