దాతల సహకారం అభినందనీయం

దాతల సహకారం అభినందనీయం
హెచ్ఎం శిరీష
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జప్తి వీరప్పగూడెం నందు పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో మంచినీటి కొరత ఉన్నందున ఆ కొరతను తీర్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త గుడిపాటి నవీన్ 35వేల విలువ చేసే వాటర్ ఫిల్టర్ పాఠశాలకు బహుకరించడం జరిగింది.ఈ సందర్భంగా హెచ్ఎం శిరీష మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతలు సహకరించడం అభినందనీయమని దాతల సహకారంతో విద్యార్థులు మంచి భవిష్యత్తును రూపొందించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుడిపాటి కోటయ్య, వై.దామోదర్ రెడ్డి, పి.జగదీశ్వర్ రెడ్డి, వి.మాధవి, టి.శ్రీనివాసరెడ్డి, డి.జలరాం, యన్. చంద్రకళ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking