‘అమీర్ అలీ’ ఫౌండేషన్ సేవలు భేష్

‘అమీర్ అలీ’ ఫౌండేషన్ సేవలు భేష్
* బైక్ మెకానిక్ రాముకు బాసటగా నిలవడం అభినందనీయం
* హమీద్ షేక్ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేసిన రాము అభ్యర్థనపై స్పందించిన సమాజసేవకులు

మిర్యాలగూడ, 
మిర్యాలగూడ పట్టణానికి చెందిన అమీర్ అలీ ఫౌండేషన్ సేవలు భేష్ అని నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ కొనియాడారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బైక్ మెకానిక్ రాము కుటుంబానికి అమీర్ అలీ ఫౌండేషన్ బాసటగా నిలవడం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. కాగా, ప్రమాదంలో గాయపడిన రాము తమ కుటుంబానికి సాయం అందించాల్సిందిగా హమీద్ షేక్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా సభ్యులను అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనపై ఇప్పటికే పలువురు దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించారు. తాజాగా, అమీర్ అలీ ఫౌండేషన్ రాము కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చింది. మిత్రులు తాజ్ బాబా, సందీప్ తో కలిసి అమీర్ అలీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్ అలీ రాము నివాసానికి చేరుకున్నారు. 25 కేజీల బియ్యం బస్తా, నెల రోజులకు సరిపడ నిత్యావసర సరుకులను పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. రాము త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ మానవతా ధృక్పథంతో సాయం అందించేందుకు ముందుకొచ్చిన అమీర్ అలీ ఫౌండేషన్ కు, ఆర్థిక సాయం అందించిన దాతలకు, హమీద్ షేక్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking