మైనారిటి గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ కు వినతి పత్రం

మైనారిటి గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ కు వినతి పత్రం

ఖమ్మం /అక్షిత బ్యూరో :

ఖమ్మం నగరంలో టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో నూతనముగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సియాసిత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ ఆత్మీయ సన్మాన సమావేశంలో మైనారిటి గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వము ద్వారా ఆర్ఎంపి పిఎంపి లకు గుర్తింపును మరియు మెడికల్ కౌన్సిలింగ్ దాడులు నిలిపివేసి అక్రమముగా పెట్టిన కేసులను ఎత్తివేయాలి 50 ఏండ్ల వయస్సు దాటిన ఆర్ఎంపి పిఎంపి లకు పెన్షన్ ఇప్పించుట నిరుపేద గ్రామీణ వైద్యులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేక ఇండ్ల స్థలములను ఇప్పించాలని కోరారు.గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయములో ఆర్ఎంపి పిఎంపి లకు ప్రత్యేక శిక్షణ మరియు గుర్తింపు కొందరికి మాత్రమే ఇచ్చినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టిఆర్యస్ ప్రభుత్వం ఏర్పడి ఆర్ఎంపి పిఎంపి లకు శిక్షణ గుర్తింపు ఇస్తామని గత బిఆర్ యస్ ప్రభుత్వం మెనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది.10 సంవత్సరాలు గడిచినా వారు ఇచ్చిన హామీ అమలు పర్చలేదు ఇప్పుడు మన కాంగ్రేస్ ప్రభుత్వం వచ్చినది.కాంగ్రేస్ ప్రభుత్వ మెనిఫెస్టో ప్రకారం ఆర్ఎంపి పిఎంపి లకు మరల శిక్షణ కొనసాగింపు మరియు సర్టిఫికేట్స్ ఇచ్చే కార్యక్రమమును త్వరగా కొనసాగించే విధముగా ప్రభుత్వము తరపున తమరు చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యస్.కె. హసన్ జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ జానిమియా కోశాధికారి షేక్ బాబుసాహెబ్ జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ హసన్ సంఘం వ్యవస్థాపకులు షేక్ నజీరుద్దీన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఖాసీం షేక్ చంద్ పాషా జిల్లా జాయింట్ సెక్రటరీ షేక్ పాషా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ మహ్మద్ సాహెబ్ ప్రచార కార్యదర్శులు షేక్ అమీర్ షేక్ జాని కార్యదర్శులు షేక్ అబ్దల్ షేక్ మస్తాన్ పాషా జిల్లా ఎగ్జిక్యూటీవ్ సభ్యులు షేక్ మన్సూర్ అలి షేక్ షాజహాన్ షేక్ నబి షేక్ అలీ షేక్ అహ్మద్ పాషా షేక్ వలి షేక్ మహిమూద్ షేక్ బాజీ షేక్ రబ్బాని షేక్ నబీ షేక్ ఇషాక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking