కోర్ట్ లో మెడికల్ క్యాంప్
ఫోర్ట్ డెంటల్ ఆసుపత్రి ఉచిత సేవలు
జస్టిస్ యశ్వంత్ నుంచి
మెమెంటో అందుకున్న
డాక్టర్ స్పూర్తి
ఇబ్రహీంపట్నం, అక్షిత ప్రతినిధి :
ఇబ్రహీంపట్నంలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ఆవరణలో అపోలో, ఫోర్ట్ డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సోమవారం కోర్ట్ ఆవరణలో న్యాయ మూర్తులు, న్యాయవాదులకు వైద్య పరీక్షలు చేశారు.
వనస్థలిపురంలోని ఫోర్ట్ డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ యం.స్పూర్తి దంత వైద్య పరీక్షలు చేశారు. అపోల్ ఆసుపత్రి వైద్యులు బిపి షుగర్, ఈసీజీ తదితర పరీక్షలు చేయగా ఎల్ బి నగర్ స్మార్ట్ విజన్ డాక్టర్లు కంటి పరీక్షలు చేశారు.
ఆనంతరం సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ యశ్వంత్ చేతుల మీదుగా డాక్టర్ స్ఫూర్తికి మెమెంటో అందజేశారు.