గదరాజు చందుకు డాక్టరేట్ అవార్డు

గదరాజు చందుకు డాక్టరేట్ అవార్డు

చేర్యాల,సెప్టెంబర్ 30 అక్షిత ప్రతినిధి: చేర్యాల మండలంలోని కడవేరుగు గ్రామానికి చెందిన గద రాజు చందుకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా, సోమవారం మీడియా సమావేశంలో చందు మాట్లాడుతూ తాతలు,తండ్రులు వెట్టి కష్టం చేసిన కుటుంబం తనది,గొడ్డు కష్టంజేసినా,గడ్డు కాలం గట్టెక్కలేని పరిస్థితి,రెక్కాడితే గానీ డొక్కాడని బతుకు వారిది,ఎద మాటున వెతలను దాచి,ఎతలకు ఎదురీది,కన్నవారి కష్టాలను తలచుకుంటూ,కడగండ్ల వడగండ్లను తట్టుకొని, కన్న కలలు ఆవిరవుతున్న వేళ తోడపుట్టిన అన్న తోడుగా నిలిచి, ఆశలకు ఊపిరి పోసి బ్రతుకు త్రోవకు బాసటగా నిలిచి,భావితరాలకు మార్గదర్శి అవ్వాలని ఉన్నత విద్యనభ్యసించి అత్యున్నత శిఖరాలకు ఎదగాలి అని అన్నల ప్రోద్బలంతో బడిబాటపట్టి అంచెలంచెలుగా ఎదిగి యూనివర్సిటీకి వచ్చి, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా కేసీఆర్  నాయకత్వంలో విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేస్తూనే అటు రాజకీయాలను, ఇటు సదువును కొనసాగిస్తూ నిమ్న కులాల జీవన విధానం, వారి సాంస్కృతిక నేపథ్యాలను వెలికి తీయాలనే తపనతో *’దొమ్మర కులస్తుల సంస్కృతిక- సాహిత్య పరిశీలన’* అనే అంశం పరిశోధనకు ఎంచుకుని కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు గొనానాయక్ మార్గదర్శకత్వంలో పరిశోధన జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి  అడుగుజాడల్లో నడుస్తూ, పరిశోధన పూర్తిచేసిన సందర్భంగా యూనివర్సిటీ అధికారులు పరిశీలించి,చందుకు డాక్టరేటు అవార్డు ఇవ్వడం జరిగింది. డాక్టరేట్ పొందిన గదరాజు చందును, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు, కుటుంబ సభ్యులు, సాహితీకారులు, మిత్రులు, ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు తదితరులు అభినందిస్తూ భవిష్యత్తు ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking