ఖమ్మంలో కనుల పండుగగా జిల్లా పద్మశాలి ఉద్యోగుల 13వ వార్షికోత్సవం
ఖమ్మం /అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా పద్మశాలి ఉద్యోగుల విభాగం 13వ వార్షికోత్సవం ఖమ్మం నగరం డిపిఆర్సి భవన్ లో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేద ప్రతిభావంతులైన పద్మశాలి విద్యార్థినీ విద్యార్థులకు సుమారు లక్ష ఇరవై వేల రూపాయల వారితోష్కాకాన్ని అందజేసినారు.ఈ సంవత్సరములు వివిధ డిపార్ట్మెంట్లలో పదోన్నతి పొందిన మరియు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను సత్కరించారు.2012 సంవత్సరంలో ప్రారంభమైన ఈ ఉద్యోగ విభాగం ప్రతి సంవత్సరం పేద పిల్లలకు నగదు పారితోషికాన్ని అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు సహకరిస్తుందని ఈ విభాగం జిల్లా అధ్యక్షుడు రచ్చ శ్రీనివాస్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని మానసిక వికలాంగులకు సుమారు 15 వేల రూపాయల వారితోషాకాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 24 డివిజన్ కార్పొరేటర్ రాష్ట్ర తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి బొమ్మ రాజేశ్వర రావు జిల్లా లక్ష్మీనారాయణ తాటి శ్రీనివాస్ జిల్లా మహిళా విభాగం సంబంధించిన గడ్డం సునీత వింజమూరు సంద్య రాణి పాల్గొన్నారు.ఉద్యోగ విభాగం కార్యవర్గ సభ్యులు మధు కుమార్ అంచనాగరాజు అప్పిని భాస్కరరావు జానకి రాములు గోపాలరావు కుసుమ నాగేశ్వరరావు పారుపల్లి సత్యనారాయణ వీరు పాల్గొన్న మహిళలకు ప్రత్యేక బహుమతిని అందజేశారు.వచ్చే సంవత్సరం సుమారు రెండు లక్షల స్కాలర్షిప్ లక్ష్యంగా చేసుకుని పనిచేస్తామని అధ్యక్షులు శ్రీనివాస్ తెలియజేశారు. కార్యదర్శి మారం మధు కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హార్దికచేయుతనిచ్చిన ప్రతి పద్మశాలి ఉద్యోగికి కృతజ్ఞతలు తెలియజేశారు.