యతీ నరసింహనంద్ సరస్వతిపై ఖమ్మంలో ఫిర్యాదు

మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యతీ నరసింహనంద్ సరస్వతిపై ఖమ్మంలో ఫిర్యాదు

సమ్మాన్ ఎన్జీవో వ్యవస్థాపక అధ్యక్షుడు అడ్వకేట్ సాధిక్

ఖమ్మం /అక్షిత బ్యూరో :

సెప్టెంబర్ 29 న ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ లోని దస్నా దేవి మందిర ప్రాంతం హిందీ భవన్ లో జరిగిన వేడుకల్లో ప్రవక్త మొహమ్మద్ (స) పై యతీ నరసింహనంద్ సరస్వతి విషం చిమ్మారు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు ఆ వీడియో లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి కేవలం భారతదేశం అరబ్ దేశాల్లోనే కాక అనేక దేశాల్లో యతీ నరసింహనంద్ సరస్వతి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.చాలా చోట్ల ప్రజలు నిరసనలు తెలిపారు, ఎఫ్ఐఆర్ లు కూడా నమోదు అయ్యాయి.గతం లో కూడా మహిళల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలు పాలు అయి బెయిల్ మీద బయట తిరుగుతున్న నరసింహనంద్ సరస్వతి ప్రవక్త మొహమ్మద్ కేవలం ముస్లిం సమాజానికే కాకుండా సమస్త మానవాళికి మానవతా విలువలు నేర్పించిన మహనీయుడు అటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారి గురించి విషపూరిత వ్యాఖ్యలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది.బెయిల్ పై బయట తిరుగుతూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం తను పోలీసు న్యాయ వ్యవస్థ ను అపహస్యం చేయడం తో సమానం. యూపి సిఎం యోగి ప్రభుత్వం కాషాయ నాయకులపై మెతక వైఖరి కి కారణం అని అగ్రహాలు నిరసనలు వెల్లువెత్తాయి అని సాదిక్ షేక్ పేర్కొన్నారు. ఇటువంటి వారి వల్ల మన భారత దేశ మత సామరస్యానికి లౌకికవాదానికి భిన్నత్వం లో ఏకత్వం కి తీవ్ర ప్రమాదం ఉంది అన్ని మతాల వారు ముఖ్యంగా యువత ఇటువంటి వారి ప్రసంగాల తో జాగ్రత్త గా ఉండాలి భావోద్వేగలకు లోనవకూడదన్నారు.ముస్లిం మైనారిటీల పై విషపూరిత ప్రసంగాలు చేయడం బెయిల్ పై బయటకు రావడం మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం యతీ నరసింహనంద్ సరస్వతి కి అలవాటు గా మారింది.ప్రవక్త మొహమ్మద్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు భారతదేశానికి ప్రపంచ దేశాల ముందు అపకీర్తిని తెచ్చి పెడుతున్నాయి యతి లాంటి వారి పై ఉపా లాంటి చట్టాలు పెట్టీ మరలా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా భవిష్యత్తు లో ఎవరైనా ఇటువంటి విషపూరిత ప్రసంగాలు చేయాలి అంటే చట్టానికి భయపడేలా ఉండాలి అని సాదిక్ షేక్ డిమాండ్ చేశారు.సామాజిక మాధ్యమాల నుండి యతి నరసింహనంద్ విషపూరిత వ్యాఖ్యలను తొలగిస్తూ ఖమ్మం లో కూడా ఎవరైనా వీడియోలను పోస్ట్ చేస్తూ ముస్లిం మైనారిటీలపై ఇస్లాం పై విషం చిమ్మకుండా నిఘా ఏర్పాటు చేయాలని తగిన చర్యలు తీసుకోవాలని సాదిక్ షేక్ డిమాండ్ చేశారు.ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని అడ్వకేట్ సాదిక్ షేక్ ఫోన్ లో సంప్రదించి యతీ నరసింహనంద్ సరస్వతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను దృష్టి లో తీసుకొని వెళ్ళగా వారి సూచనల మేరకు ఏసీపి రమణ మూర్తి కి ఫిర్యాదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking