పురుషోత్తంరెడ్డి చిత్రపటానికి నివాళి*

*పురుషోత్తంరెడ్డి చిత్రపటానికి నివాళి*

అనంతగిరి, అక్షిత న్యూస్ :

రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందగా.. ఆదివారం మండలంలోని గోండ్రియాల గ్రామ కాంగ్రెస్ నాయకులు పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు గొట్టేముక్కల బాబురావు, శివాలయ కమిటీ చైర్మన్ ఏటుకూరి రమేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking