తండ్రిని కోల్పోయిన చిన్నారి
చేర్యాల అక్టోబర్ 6 అక్షిత ప్రతినిధి: చేర్యాల మండలం చుంచనకోట గ్రామానికి చెందిన కొమ్ము కనకయ్య కొంతకాలంగా భార్యతో కలిసి బతుకుదెరువు కోసమని హైదరాబాద్ వెళ్లి అక్కడ భార్య భర్తలు కూలి పనులు చేసుకుంటూ కుటుంబం సాగిస్తున్నాడు, ఆదివారం తన భార్య పనికి వెళ్లిన అనంతరం కనకయ్య అకస్మాత్తుగా చనిపోవడంతో, చనిపోయిన విషయం తెలియక చిన్నారి నాన్న ఏమైపోయిందో తెలియక ఆందోళన చెంది పక్కింటి వారిని పిలిచి చెప్పడంతో, పక్కన ఉన్న వారు చూసి చిన్నారికి మీ నాన్న మృతి చెందినాడని తెలుపగా, కన్న కూతురు కన్నీటి పర్యంతమైంది. ఇట్టి విషయాన్ని స్థానికులు తన భార్యకి తెలియపరిచారు. సడన్గా భర్త చనిపోవడంతో భార్య తీవ్రంగా బాధపడుతూ రోదించింది, ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వంతోపాటు, ఎవరైనా దాతలు ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.