*పిఆర్ టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడుగా గుత్తికొండ సుదర్శన్ రెడ్డి*
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ప్రోగ్రెసివ్ రికగ్నైస్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడుగా మిర్యాలగూడ నివాసి ఉపాధ్యాయుడు గుత్తికొండ సుదర్శన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హైదారాబాద్ శామీర్ పేటలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పిఆర్టియు నూతన శాఖను ఎన్నుకున్నారు. సుదర్శన్ రెడ్డి యన్ యస్ పి క్యాంపు మిర్యాలగూడ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు శక్తి వంచన లేకుండా కృషిచేస్త అన్నారు.తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు ఫనికుమార్, ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, మిర్యాలగూడ అర్బన్ అధ్యక్షుడు మునగాల రాంరెడ్డి ,ప్రధాన కార్యదర్శి అనుముల సైదిరెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.