వజ్రమ్మ కుటుంబానికి భాస్కర్ రావు పరామర్శ

వజ్రమ్మ కుటుంబానికి భాస్కర్ రావు పరామర్శ

మాడుగులపల్లి, అక్షిత న్యూస్ :

మిర్యాలగూడ నియోజకవర్గంలో మాడుగులపల్లి మండలంలో ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన రైతు బంధు సమితి మండల మాజీ అధ్యక్షులు మిర్యాల మధుసూదన్ తల్లి వజ్రమ్మ (95) మృతి చెందారు. వృద్ధాప్యం కారణంగా ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు వజ్రమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలతో నివాళి అర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. భాస్కర్ రావు వెంట మాజీ జెడ్పీ కో-ఆప్షన్ మెంబర్ ఎండీ మోసిన్ అలీ, మండల అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, జెర్రిపోతుల రాములు గౌడ్, ఇంద్రారెడ్డి, కోటిరెడ్డి, నరేందర్ రెడ్డి, కూరెళ్ళ వెంకటాచారి, మారుతి వెంకటరెడ్డి, నాగరాజు, తదితరులు ఉన్నారు. 

Leave A Reply

Your email address will not be published.

Breaking