ప్రొఫెసర్ సాయిబాబా మనకికలేరు

ప్రొఫెసర్ సాయిబాబా మనకికలేరు

ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి •

పదేండ్లు జైలులో మగ్గి…

అనారోగ్యంతో
సాయిబాబాకు చికిత్స

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

అతనిది మహోన్నత వ్యక్తిత్వం. పేదల గొంతుక…
శరీర అంగవైకల్యం ఉన్నా… మానసిక పరిపక్వత కల్గిన మేదోసంపతి అతని సొంతం. హక్కుల పరిరక్షణ ధీరుడి గొంతుక మూగపోయింది. ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (56) శనివారం రాత్రి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. రెండు వారాలుగా జీర్ణకోశ సంబంధిత సమస్యతో ఆయన చికిత్స పొందుతున్నారు. కాలేయం, చిన్న పేగు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు సూచించారు. కానీ బీపీ (రక్తపోటు) కంట్రోల్ కాకపోవడంతో సర్జరీపై డాక్టర్లు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ట్రీట్మెంట్ కొనసాగు తుండగానే శనివారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి రాత్రి 8.45 గంటలకు చివరి శ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు.

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు ఆయన్ను 2014లో అరెస్టు చేశారు. అండర్ ట్రయల్ ఖైదీగా 2016 వరకూ జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. కానీ గడ్చిరోలి ట్రయల్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధిం చడంతో 2017 నుంచి నాగ్పూర్ జైలులోనే ఉన్నారు. దాదాపు 90% అంగవైకల్యంతో ఉన్న తనకు జైలు అధికారులు సరైన వసతి కల్పించలేదని, నిత్యం వీల్ చైర్కు మాత్రమే. పరిమితమైన తనకు సౌకర్యాన్ని కూడా కల్పించలేదని పలు మార్లు బాంబే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినా బెయిల్ ఇవ్వ దానికి హైకోర్టు నిరాకరించింది. చివరకు సుప్రీంకోర్టు ఆదేశంతో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కాగా మార్చి 7న సాయిబాబా విడులయ్యారు. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన ఆయన ఏడేండ్లుగా జైలులో పెరిగిన అనారోగ్య సమస్యలకు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు గత నెల బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో సాయిబాబా వివరించారు. సాయిబాబా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారు అయినప్పటికీ 1990వ దశకంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమ ర్ణించారు. ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను హైదరాబాద్ మొదలు ఢిల్లీ వరకు అనేక వేదికలపై ప్రస్తావించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడం, పోలీసులు కేసు పెట్టడం, గడ్చిరోలి కోర్టు దోషిగా పేర్కొని జీవిత ఖైదు విధించడంతో ఢిల్లీ యూనివర్శిటీ యాజమాన్యం ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించింది. సాయిబాబా అంత్యక్రియలు హైదరాబాద్లోనే నిర్వహించనున్నట్లు సన్ని హితులు  తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking