అంతా సుభిక్షంగా ఉండాలి
పలు దసరా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బిఎల్ఆర్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
విజయదశమి(దసరా) సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ శనివారం పాల్గొన్నారు.

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతిఒక్కరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.