ఇందిరా మహిళా డెయిరీ యూనిట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం /అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కేంద్రంలో పాలశీతలీకరణ కేంద్రం ఇందిరా మహిళా డెయిరీ యూనిట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో విజయదశమి రోజున మొదలు పెట్టిన ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు విజయవంతమై దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.మొత్తం మహిళలతో నిర్వహించే ఇందిరా మహిళా డెయిరీ పరిశ్రమను సందర్శించడానికి దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు మహిళా సంఘాల సభ్యులు క్యూ కడుతారు.ఇందిరా మహిళ డెయిరీ ఏర్పాటుతో మధిర నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులను వ్యాపారవేత్తలుగా ప్రజా ప్రభుత్వం తయారు చేయబోతున్నది.మహిళలతో కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి ఇందిరా మహిళా డెయిరీ ని చాలా పకడ్బందీగా నిర్వహిస్తాం.పాల ఉత్పత్తి, పాల సేకరణ పాల అమ్మకాల ద్వారా వచ్చే ప్రతి పైసా మహిళా సభ్యులకే చెందే విధంగా ప్రాజెక్టును రూపకల్పన చేశాం.పాల ఉత్పత్తి చేయడానికి నియోజకవర్గంలో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు ప్రభుత్వం రెండు గేదెలను పంపిణీ చేస్తుందన్నారు.మండలంలో ఉన్న నిరుద్యోగులను ఎంపిక చేసుకొని వారికి కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పించి గేదెలకు కావలసిన వరి, పచ్చి గడ్డి, దాణాను ఇంటింటికి సరఫరా చేయిస్తాము. పశువుల కావలసిన మందులు పంపిణీ చేయడంతో పాటు అత్యవసర సమయాల్లో పశువులకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి మండలంలో అంబులెన్స్లను ఏర్పాటు చేస్తాము.ప్రతి గేదెకు హెల్త్ కార్డు ఏర్పాటు చేయించి సక్రమంగా వైద్యం అందే విధంగా చర్యలు చేపడతాము.దృఢమైన సంకల్పంతో మీరందరూ సమిష్టిగా పనిచేస్తే ఈ ప్రాజెక్టు విజయాన్ని ఎవరు ఆపలేరు విజయం మీకే చెందుతుంది. ఈ డెయిరీ ఏర్పాటు ద్వారా మీ కుటుంబాలు ఆర్థిక పరిపుష్టిగా ఉన్నతంగా ఎదగడానికి దోహదపడుతుంది. మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు మీరు అందించవచ్చు.వ్యవసాయ ఆధారితమైన మధిర నియోజకవర్గంలో కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే ఆర్థిక సంపద పరిమితం కావొద్దని భావించి ప్రత్యామ్నాయంగా ఆర్థిక వనరులు సమకూర్చడానికి చేసిన ఆలోచనల నుంచి వచ్చినదే ఇందిరా మహిళ డెయిరీ ప్రాజెక్ట్.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు 2010లో ఈ ప్రాజెక్టు గురించి నేను ఆలోచన చేశాను. 2011-12 సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రజల ముందుకు తీసుకువచ్చాం. గుజరాత్ రాష్ట్రంలోని అమూల్ ముల్కనూరు డెయిరీ పరిశ్రమలకు నియోజకవర్గం నుంచి మహిళలను పెద్ద ఎత్తున పంపించి అధ్యయనం చేయించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పాలకులకు ప్రజల అన్న, మహిళల అన్న లెక్కలేని తనంతో వ్యవహరించి ఈ ప్రాజెక్టు కు ఒక పైసా కూడా నిధులు ఇవ్వలేదు. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపిల ను గత పాలకులు అర్థం లేకుండా చేశారు
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను మొదటి ప్రాధాన్యత గా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేసే కార్యక్రమం మొదలుపెట్టాను.మహిళలంటేనే ప్రజా ప్రభుత్వం మహాలక్ష్మిలుగా కొలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను మహాలక్ష్మి లుగా తీర్చిదిద్దుతామని ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ హామీలను ఇచ్చింది. అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తున్నాము.ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్న డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 400 కోట్ల రూపాయలను ఆర్టీసీకి చెల్లిస్తున్నది.మధిర నియోజకవర్గం లోని 238 గ్రామ సంఘాలు 5884 స్వయం సహాయక సంఘాల గ్రూపులు, 61,409 మంది సభ్యులు ఏదో ఒక వ్యాపారం చేసే విధంగా వడ్డీ లేని రుణాలను ఇచ్చి ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రజా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తున్నది