*బోదులబండ హైస్కూల్లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*
ఖమ్మం, అక్షిత ప్రతినిధి :
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1997-1998 లో 10 వ తరగతిలో చదివిన 40 మంది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.25 ఏండ్ల తరువాత కలిసిన ఆనందంలో ప్రతి ఒక్కరూ ఒకరినొకరు పరిచయం చేసుకొని తమ హై స్కూల్ విద్యని నేర్పిన ఉపాధ్యాయులను వారి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ముందుగా తమతో పాటు కలిసి చదువుకొని వివిధ కారణాల వలన చనిపోయిన విద్యార్థులకి నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అనంతు నవీన్ జర్నలిస్టు తుమ్మ ఉపేందర్ పిజిక్స్ లెక్చరర్ ఎలుగూరి వీరభద్రమ్ ఉపాధ్యాయులు గోనే వెంకటేశ్వర్లు పరకాల శ్రీనివాస్ కలకోట నవీన్ కట్టా లింగరావు ఎటుకూరి నరేష్ (ఆర్టీసి)వీసం ఉమా స్వప్న చంద్ర కళ ప్రతి ఒక్కరూ మాట్లాడి వారి వారి అమూల్యైన సందేశాన్ని ఇచ్చారు. అనంతరం వారు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో ఆడిపాడి ఆనందం వ్యక్తం చేశారు. క్లాస్మేట్స్ అందరూ సహపంక్తి భోజనం చేసి ఆనందోత్సవాలతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు.