దానయ్యకు కొలువు… సత్కరించిన నేతలు

దానయ్యను సన్మానించిన దళిత నాయకులు

వేములపల్లి, అక్షిత న్యూస్:

వేములపల్లి మండల కేంద్రం హరిజన వాడకు చెందిన దైద సత్యవతి కూతురు ఎడ్ల ఝాన్సీ భర్త దైద దానయ్యకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యా యుడిగా ఉద్యోగం రావడం జరిగింది. ఆదివారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టల సందీప్ మాదిగ ఆధ్వర్యంలో నాయకులుదైద వెంకటేశ్వర్లు(జిరాక్స్) , పుట్టల మట్టయ్య, పుట్టల పౌలు, దైద రాజులు దానయ్యకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఝాన్సీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేస్తూ దానయ్యతో వివాహం అయినప్పటి నుంచి కుటుంబ భారాన్ని మోస్తూ భర్త చదువు విషయంలో అన్నీవిధాలుగా సహకరించుకుంటూ వస్తుందని, ఆమె ప్రోత్సాహంతో నేడు దానయ్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడం అభినందనీయ మన్నారు.ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందనడానికి నిదర్శనం ఎడ్ల ఝాన్సీఅని కొనియాడారు. ఝాన్సీ దానయ్య దంపతులు నేటి యువతకు ఆదర్శం అని భార్య భర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడం దళిత సమాజానికి గర్వకారణమన్నారు. దానయ్య 15 ఏళ్లుగా చదువును నమ్ముకొని ఏనాటికైనా అనుకున్నది సాధించుకోవాలనే పట్టుదలతో చదువుతూ ఉండేవాడని ప్రపంచంలో సరస్వతి దేవి కరుణ కటాక్షం కలిగిన వ్యక్తి ఓడిపోయినట్టు చరిత్రలో లేదని కష్టమైనప్పటికి ఇష్టంతో చదివినప్పుడు అనుకున్న ప్రతిఫలం తప్పక దొరుకుతుందని దీనికి ప్రత్యక్ష సాక్షి దానయ్య అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking