మృతుల కుటుంబానికి పదో తరగతి మిత్రుల చేయూత

*మృతుల కుటుంబానికి పదో తరగతి మిత్రుల చేయూత*

ఇబ్రహీంపట్నం, అక్షిత ప్రతినిధి :

గతంలో మృతి చెందిన చెరుకూరి జగన్, మాచర్ల పెంటయ్య కుటుంబాలకు పూర్వ విద్యార్థులు ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన చెరుకూరి జగన్, ఎన్గల్ గూడ కు చెందిన మాచర్ల పెంటయ్య గతంలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే పోల్కంపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో1999-2000 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివారు. జగన్ కుటంబ సబ్యులకు 10 వేలు, పెంటయ్య కుటుంబ సభ్యులకు 10 వేలు అందజేసి మానవత్వం చాటుకున్నారు. భవిష్యత్తులో జగన్, పెంటయ్య కుటుంబ సభ్యులకు ఇబ్బందులు కలుగకుండా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జగన్, పెంటయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నదుకుడి శ్రీనివాస్, గుండ్ల అశోక్, గుండ్ల రాజు, మాచర్ల సురేందర్, పంది బాలరాజు, పంది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking