గంగమ్మ ఒడికి దుర్గాదేవి….

గంగమ్మ ఒడికి దుర్గాదేవి….

నంగునూర్, అక్షిత ప్రతినిధి :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవలు ముగించుకొని
తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు పొద్దున, సాయంత్రం భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న దుర్గాదేవి గంగమ్మ వాడికి చేరుకుంటుంది నర్మెట్ట గ్రామంలోనే మొదటిసారిగా ఎస్సీ కాలనీలో 2012 లో ప్రారంభించి ఇప్పటివరకు నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఏటా జరుపుతున్నారు. ఈరోజు గంగమ్మ ఓడికి అంగరంగ వైభవంగా ఆట పాటలతో భజనలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి శోభయాత్రను టీ షర్ట్ దాతగా చీరాల దాత గా డీ భాగ్య రాజు లు, సంతోష నరేష్ లు ,టీషాట్ సరళ రవీందర్, నిర్మల, నరసింహులు అన్నదాతగా లక్ష్మి కనకయ్యలు, విగ్రహ దాతగా శిరీష్ కృష్ణలు, పూజ సామాగ్రి ముందుకు స్రవంతి శ్రీహరి వచ్చి అమ్మవారి భక్తి కృపకు పాత్రులయ్యారు. పుర్ర సూర్య, గుడ్డోల పరశురాములు, గుడ్డోల విష్ణు, మంకళ రాజశేఖర్ అమ్మవారి మాలలు ధరించి తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అమ్మవారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీవాసులు,పెద్దలు మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking