పార్క్ స్థలాలు కబ్జా

ప్రజా అవసరాలకు వినియోగించిన పార్కుల్లో అక్రమ నిర్మాణాలు

బౌరంపేట్ లహరి లేఔట్ లో పార్కులను కాపాడండి..

దుండిగల్ పురపాలక పరిధి బోరంపేట్ గ్రామంలో లహరి లేఔట్ లో 6 పార్క్ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు..

వెంటనే తొలగించి పార్క్ స్థలాలు కాపాడి ప్రజా అవసరాలకు
వినియోగించాలని కమీషనర్ కు వినతిపత్రం అందజేత బిజెపి నాయకులు..

మేడ్చల్, అక్టోబర్ 16 అక్షిత బ్యూరో :

ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన స్థలాలు కబ్జాకు గురయ్యాయి.బౌరంపేట్ లహరి లేఔట్ లో పార్కులను కాపాడాలని.. దుండిగల్ మున్సిపల్ కమీషనర్ సత్యనారాయణ రావుకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది. అన్నారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్

మాట్లాడుతూ సర్వేనెంబర్ 541, 542, 543, 544, 545, 546, 547, 548, 549, 560, 561 లహరి గ్రీన్ పార్క్ లేఅవుట్, బౌరంపేట దుండిగల్ మండలoలో పార్కులు ఓపెన్ స్పేస్ ల ఆక్రమణ అక్రమ అనుమతులు నిర్మాణాలు తక్షణమే కూల్చివేసి పార్కులను ఓపెన్ స్థలాలను కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవడం కాకుండా తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించుకుని అక్రమ అనుమతులు, అనుమతులు లేకుండా 5 పార్క్ ప్రదేశాలలో అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి.

దానిలో ప్రధానంగా క్రీక్ స్కూల్ వద్ద రెండు పార్కులు ఆక్రమించుకొని ఆక్రమ షెడ్ల నిర్మాణమే కాకుండా ఒక భారీ భవన నిర్మాణం జరుగుతుంది. మరొక సైడు విఎన్ఆర్ కాలేజ్ హాస్టల్ వారు ఆక్రమించుకొని దర్జాగా కాంపౌండ్ వాల్ కట్టుకొని హాస్టల్ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. కత్వా చెరువు సైడు మరొక పార్క్ స్థలంలో రెండు భారీ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి.

అంతేకాకుండా లహరి గ్రీన్ పార్క్ ఎంట్రన్స్ వద్ద పార్క్ కామన్ ప్లేస్ నందు భారీ అక్రమ నిర్మాణం జరుగుతుంది, ఈ విధంగా లారీ గ్రీన్ పార్క్ కాలనీ నందు ఐదు నుంచి పది ఎకరాల వరకు పార్కు మరియు ఓపెన్ స్పైసెస్ స్థలాలు కాలనీ ప్రజలకు చెందాల్సి ఉంటుంది. కానీ కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాలు సృష్టించుకుని అక్రమ అనుమతులు పార్కు స్థలంలో పొంది నిర్మాణాలు జరుగుతున్న కూడా దుండిగల్ మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాకుండా వీఎన్నార్ కాలేజ్ విఎన్ఆర్ హాస్టల్ విద్యార్థులు హాస్టల్ భవనం ఆనుకొని పార్క్ స్థలాన్ని(2500 గజాలు) దర్జా కబ్జా పెట్టుకుని అనుభవిస్తున్న మున్సిపల్ అధికారులు ఎందుకు చర్య తీసుకోవడం లేదు. ఈ విధంగా 40 కోట్ల విలువ చేసే పార్క్ స్థలాలు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల సహకారంతో ఆక్రమణ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మీకు తెలియజేస్తున్నాను.కావున తక్షణమే లారీ గ్రీన్ పార్క్ లేఔట్ నందు పార్కు మరియు ఓపెన్ స్పైసెస్ స్థలాలను తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి, వచ్చిన నివేదిక ఆధారంగా అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని, పార్కులను కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పార్కులను పునరుద్ధరించి లహరి గ్రీన్ పార్క్ కాలనీ ప్రజల అవసరాల కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking