రామన్నపేట ప్రాంతాన్ని ఎడారిగా మార్చొద్దు
పర్యావరణం కాపాడాలి
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకం
ప్రజల ఆరోగ్యం మే ముద్దు అంబుజా ఫ్యాక్టరీ వద్దు
నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పూర్తి వ్యతిరేకం ప్రజల ఆరోగ్యమే ముద్దు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు అంటూ నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ గేటు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం రామన్నపేట తహసిల్దార్ కార్యాలయంలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చవద్దు పర్యావరణాన్ని కాపాడాలి ప్రజల జీవితాన్ని కాపాడాలి వృత్తిసంఘాలకు ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల భవిష్యత్తులో హాని ఉందని గౌడ చేనేత వర్తక సంఘాలకు ప్రతి ఒక్కరికి అంబుజా ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల అనారోగ్య బారిన పడే అవకాశం ఉన్నది మాయ మాటలు చెప్పి రైతులను వలలో వేసుకుని సుమారుగా 360 ఎకరాల భూమిని సేకరించి ఇనాం భూములు కబ్జా చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, సుమారుగా ఈ కంపెనీ ఏర్పాటు వల్ల 40 గ్రామాలు ముప్పు ప్రాంతంగా అనారోగ్య బారిన పడుతున్నాయని నీరు వాయు కాలుష్యం ఏర్పడుతుందని. ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి ప్రజా జీవితాలే ముఖ్యమని కార్పొరేట్ వ్యవస్థలకు సహకరించవద్దని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రజా జీవితాలతో చెలగాటం వద్దని సందర్భంగా హెచ్చరించారు ప్రభుత్వం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఇచ్చిన పర్మిషన్లను. వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో ప్రజా అభిప్రాయం మేరకు ప్రజల ఆరోగ్యరీత్యా ఆందోళన కార్యక్రమాలు భారీ ఎత్తున చేపడతామని సందర్భంగా అన్నారు 23 బుధవారం జరిగే ప్రజా అభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని గ్రామ గ్రామం నుండి వేలాదిమందిగా తరలివచ్చి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా నిరసన తెలియజేసి అడ్డుకోవాలని ఈ సందర్భంగా అన్నారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు,