పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తించాలి
సిఐ శ్రీను
చేర్యాల అక్టోబర్ 21 అక్షిత ప్రతినిధి: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం చేర్యాల సిఐ ఎల్. శ్రీను, ఎస్ఐ నిరేష్ ల తో కలిసి చేర్యాల పట్టణంలోని పోలీస్ అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగఫలం ఇప్పుడు మనము అనుభవిస్తున్నామని, ఎంతోమంది వారి ప్రాణాలు ఫణంగా పెట్టి శాంతి భద్రతలు సంఘవిద్రోవశక్తుల నుండి దేశాన్ని కాపాడడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తిస్తూ వారిని స్మరిస్తూ ఉండాలని వారు చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ప్రజల ధన మాన ప్రాణ రక్షనే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజలు కూడా అండగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.