రైతు సంక్షేమానికి భరోసా
జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం…
జనగామ, అక్షిత ప్రతినిధి:
జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం బాధ్యతలను స్వీకరిస్తూ, ప్రమాణ స్వీకారం చేసిండ్రు… సోమవారం స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి హాజరయ్యారు. జిల్లా మార్కెటింగ్ అధికారి కమిటీ ప్రతినిధులతో ప్రమాణం చేయించారు. అధ్యక్షుడు బనుక శివరాజ్యాదవ్ బాధ్యతల స్వీకరించి సంతకం చేశారు.

ఉపాధ్యక్షుడు కొల్లూరి నర్సింలు, సభ్యులుగా సభ్యులు-శీలం కొండల్ రెడ్డి, బానోతు బన్సి, నామాల శ్రీనివాస్, బొట్ల నర్సింగరావు, బుట్రెడ్డి శ్రీలతారెడ్డి, మహ్మద్ బాష్మియా, నీలం మోహన్, బండ కుమార్, తోటకూర రమేశ్, గాదె రమేశ్, వనపర్తి శ్రీని వాస్, నాగబండి రవీందర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, మార్కెట్ మాజీ ఛైర్మన్ కె.మహేందర్, డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, వ్యాపార, కార్మిక సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి, చౌరస్తా నుంచి మార్కెట్ యార్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.