*మా భవిష్యత్తుకు భరోసా ఏది* ..?
*సిమెంట్ కంపెనీ పెట్టి మా బాల్యాన్ని ,బడి చదువుల్ని ,భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయొద్దు*
*ప్రజాభిప్రాయ సేకరణలో ప్లకార్డు పట్టుకొని చిన్నారి సైతం నిరసన*
రామన్నపేట అక్షిత ప్రతినిధి :
పర్యావరణాన్ని ప్రజారోగ్యాన్ని పచ్చని పల్లెల్లో వ్యవసాయాన్ని విధ్వంసం చేసే ఆదాని అంబుజా సిమెంట్ పరిశ్రమ నెలకొల్పడం మూలంగా భవిష్యత్తు తరాలు తీవ్రమైన అనారోగ్య బారిన పాడే ప్రమాదం ఉందని జనావాసాల మధ్య పరిశ్రమ నెలకొల్పి భవిష్యత్తు తరాల జీవన విధానాన్ని ప్రశ్నార్ధకం చేయొద్దని ఈరోజు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో వేలాదిమందిగా పాల్గొన్నారు ఒక చిన్న పాప గో బ్యాక్ అంబుజా గో బ్యాక్ ఆదాని అంటూ వినూత్నంగా నిరసన తెలపడం జరిగింది