లైఫ్ స్పాన్ ఆస్పత్రికి బెస్ట్ ఎమర్జింగ్ అవార్డు 

లైఫ్ స్పాన్ ఆస్పత్రికి బెస్ట్ ఎమర్జింగ్ అవార్డు 

ఆస్పత్రి సేవలను అభినందించిన వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ..

తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న లైఫ్ స్పాన్ ఆస్పత్రి..

మేడ్చల్, అక్షిత బ్యూరో : కుత్బుల్లాపూర్: వైద్యరంగంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న లైఫ్ స్పాన్ యాజమాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకొని వైద్య రంగంలో ప్రజలకు అనారోగ్య భారిన పడిన వారికి ప్రాణా నష్టం లేకుండా ఎమర్జెన్సీ సేవలో ఎంతో ఓర్పుతో వైద్యం అందించడంలో లైఫ్ స్పాన్ ఆస్పత్రి నిష్ణాత్మమైన సేవలందిస్తూ ముందుకు సాగుతుందన్నారు.

అత్యవసర సేవలు, కార్డియాక్ అరెస్టులు, బ్రెయిన్ స్ట్రోక్ లు ఎక్కువగా జరుగుతున్న ఈ రోజుల్లో క్రిటికల్ కేర్ విభాగంలో ప్రత్యేక దృష్టి సారించి ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి ప్రాణాలు కాపాడడంలో లైఫ్స్పాన్ యాజమాన్యం, వైద్య బృందం ముందంజలో ఉందని మంత్రి అభినందించారు. హైదరాబాద్ జంట నగరాలలో సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ సేవల్లో ముందున్న లైఫ్ స్పాన్ ఆస్పత్రికి తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ ఎమర్జింగ్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా లైఫ్ స్పాన్ ఆస్పత్రి డైరెక్టర్లు డాక్టర్ నరేంద్రరామ, డాక్టర్ సురేష్ రాజు, డాక్టర్ ప్రేమ్ కుమార్, డాక్టర్ అనిల్ కుమార్ లు అవార్డును అందుకున్నారు. లైఫ్ స్పాన్ హాస్పిటల్ రాబోయే రోజుల్లో మరింత ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తమ సేవలు గుర్తించి అవార్డును అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking