పేదవాడి ఆకలి తీర్చిన మహానేత ఇందిరా గాంధీ
ఇందిర ఆశయ సాధనకు కృషి
శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి..
గరిబీ హఠావో నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుందని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు.దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ మరియు శిల్పారామం వద్ద ఉన్న ఇందిర గాంధీ విగ్రహానికి ఎం.బి.సి చైర్మన్ జెరిపేటి జైపాల్, శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులతో కలిసి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశపు కీర్తిని నలుమూలల చాటి చెప్పిన ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ అని, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని శక్తివంతమైన మహిళా నేతగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు.ఇందిరా గాంధీ దేశానికి చేసిన నిరుపమాన సేవలు నాటితరం నాయకులే కాదు నేటి తరం నాయకులకు కూడా స్ఫూర్తిదాయకం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, సయ్యద్ గౌస్, మహిపాల్ యాదవ్, కూన సత్యం గౌడ్, రాజు,హరికిషన్, యాదయ్య గౌడ్,సౌందర్య రాజన్, నగేష్ నాయక్ చంద్రయ్య, ,కవిరాజ్, ఇస్మాయిల్, సాజిద్, మునాఫ్ ఖాన్, ముఖ్తార్, సూర్య రాథోడ్,ముషారఫ్,సాయి కిషోర్, దుర్గేష్, నరేష్ మహిళలు శశిరేఖ,శ్రీజ రెడ్డి, మొగులమ్మ తదితరులు పాల్గొన్నారు.