కొమ్మూరి చొరవతో గోదావరి జలకళలు

కొమ్మూరి చొరవతో గోదావరి జలకళలు

చేర్యాల అక్టోబర్ 31 అక్షిత ప్రతినిధి: మండలంలోని కడవేరుగు గ్రామ చెరువు నేడు మత్తడితో జలకలను సంతరించుకొని అలుగు పోస్తున్న తీరు కనిపిస్తున్న సందర్భంగా, గురువారం చేర్యాల మండల యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరుట్ల వినీత్ మాట్లాడుతూ, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చొరవతో, గోదావరి జలాలను తపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా నేడు రైతాంగానికి, అందించాలనే దృఢ సంకల్పంతో యాసంగి పంటల సాగుకు అవసరమైన నీటి వినియోగం కోసం, భూగర్భ జలాలలో నీటి నిల్వలను పెంచే విధంగా, కృషి చేయడం అభినందనీయమని తెలుపుతూ, ఇంతటి సహకారం చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామ ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ చెరువును సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బాగోతం బాలచంద్రం, యూత్ అధ్యక్షుడు నీరటి విజయ్, సీనియర్ నాయకులు బాగోతం బాలచంద్రం, జల్లి అంజయ్య, భూపతి, నరేందర్, ఫరీద్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking