*కమిషనర్ ను కలిసిన* *టీయూడబ్ల్యూజే బృందం*
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్.హరిష్ ను మంగళవారం నాడు సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది.
ఈ సందర్బంగా జర్నలిస్టుల ఆయా సమస్యలను వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సలహాలతో సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హరిష్ తెలిపారు. ప్రతినిధి బృందంలో టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కలకూరి రాములు, కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. రాజేష్, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, ఐ జే యూ జాతీయ కౌన్సిల్ సభ్యులు, జర్నలిస్ట్ యాంటి అటాక్స్ కమిటి సభ్యులు మాతంగి దాస్ లు ఉన్నారు.