గోట్లకొండ లంబాడి తండాల్లో మెరిసిన వకీల్ సాబ్ ( న్యాయవాది)
మాలోతు వెంకన్న జాదవ్
నర్సంపేట, అక్షిత ప్రతినిధి :
నెక్కొండ మండల శివారు అజ్మీర మంగ్యతండా గ్రామపంచాయతీ మామిడి తోట తండాకు చెందిన మాలోతు. వెంకన్న జాదవ్ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో LLB పూర్తిచేసుకుని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి తో న్యాయావాదిగా ప్రమాణస్వీకారం చేసినాడు. ఇటు చదువుకుంటూ రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. తల్లిదండ్రులు మాలోతు. అమ్మి- దల్ సింగ్ నాయక్ కూలి పని చేసుకుంటూ మాలోతు వెంకన్నను చదువుపించినారు. మాలోత్ వెంకన్న తన తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాలను కన్నీరు చూసి కష్టపడి న్యాయవాదిగా విజయం సాధించినాడు. వెంకన్న తల్లిదండ్రుల పరిస్థితి రెక్క ఆడితే గాని డొక్కా నిండని పరిస్థితి. బాల్యం నుండి మాలోతు. వెంకన్న నాయక్ రెడ్ల వాడలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో 7 ఏడవ తరగతి వరకు చదివినాడు. ఆ తర్వాత విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి స్కూల్ టాపర్ గా నిలిచినాడు. ఆ తర్వాత పై చదువుల కొరకు హనుమకొండ లో ఉన్నటువంటి హనుమకొండ లో ఉన్నటువంటి త్రిశూల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత సాధించినాడు. ఆ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి ర్యాంకు సాధించి రంగారెడ్డి జిల్లాలో ఉన్న. మల్లారెడ్డి కాలేజీలో సీటు సాధించినాడు. అదే కాలేజీలో. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసినాడు. ఆ తర్వాత పీజీసెట్ ఎగ్జామ్ రాసి కాకతీయ యూనివర్సిటీ వరంగల్ పీజీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ సీటు సాధించినాడు. ఇలా చదువుకుంటానే ఎన్నో రకాలైన సోషల్ ఆక్టివిటీస్ చేస్తున్నాడు. గిరిజన సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఏ గిరిజన బాలిక మీద అయినా అత్యాచారం జరిగిన అఘయిత్యం జరిగిన మర్డర్లు జరిగిన గ్యాంగ్ రేప్లు జరిగిన ప్రశ్నించడంలో ముందంజ ఉండేవారు. తన చేస్తున్న పోరాటాన్ని చూసి LHPS జాతీయ ప్రెసిడెంట్ జాటోతు కిషన్ నాయక్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా LHPS అధ్యక్షులుగా నిర్ణయించడం జరిగింది. గిరిజనల పట్ల ప్రశ్నిస్తూనే తమ గ్రామ సమస్యల మీద చూపించేవారు. అప్పుడు ఉన్నటువంటి BRS నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరియు నెక్కొండ పార్టీ అధ్యక్షులు సంఘాన్ని.సూరన్న కలిసి నెక్కొండ మండల పార్టీ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఇటు రాజకీయంగా ఎక్కడ అన్యాయం జరిగినా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ న్యాయం కోసం పోరాటం చేసేవారు. గిరిజన బిడ్డల సమస్యలు తెలుసు కాబట్టి గిరిజనులు సమస్య తరపున వచ్చే కేసు లను ఉచితంగా వకాలాత్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇందుకు తండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాలోతు.వెంకన్న జాదవ్ మాట్లాడుతూ గిరిజన బిడ్డలు వివిధ రంగాలతో పాటు చాలామంది న్యావాదిగా తయారు కావాలి అని చెప్పడం జరిగింది. తన వంతు సలహా సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది.