అబుల్ కలామ్ సేవలు చిరస్మరణీయం
ఆర్డీఓ అశోక్ రెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి : భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి చేసిన సేవలు మరువలేనివని నల్గొండ ఆర్డిఓ అశోక్ రెడ్డి అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం ఎస్ఎల్ బిసిలో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన “అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవానికి”ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ…. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ప్రభుత్వము ప్రతి సంవత్సరం నవంబర్ 11న “మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహిస్తున్నదని అన్నారు.

దేశంలో విద్యా వ్యవస్థ పటిష్ఠతకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తదితరులు హాజరయ్యారు.