రేవంత్‌ భూదాహం.. రైతన్నకు ద్రోహం : కేటీఆర్‌

రేవంత్‌ భూదాహం..

రైతన్నకు ద్రోహం : కేటీఆర్‌

మ్యాక్స్‌ బీన్‌ కంపెనీ విస్తరణ కోసం రైతుల భూములు లాక్కుంటున్నరు

ఎస్సీ, ఎస్టీ,బీసీల భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ దందాకు యత్నం
పట్నం నరేందర్‌రెడ్డి ఏమైనా టెర్రరిస్టా?

కిడ్నాప్‌ చేసినట్టు అరెస్టు ఎలా చేస్తరు?
ఇందిర’ఎమర్జెన్సీ సర్కారును తలపిస్తున్న రేవంత్‌
అందుకే ఇంటర్నెట్‌ ఆపేసి మరీ రైతన్నల అరెస్టు
సురేశ్‌ మా కార్యకర్తే.. భూమి కోసమే ప్రశ్నించాడు
సీఎం సొంత నియోజకవర్గంలో రైతులు అరెస్టు అవుతుంటే మహారాష్ట్రలో రేవంత్‌రెడ్డి ప్రచారం
రేవంత్‌కు ఒంటరిగా కొడంగల్‌ వెళ్లే దమ్ముందా?
లగచర్ల రైతులకు అండగా ఉంటాం: కేటీఆర్‌
కేబీఆర్‌ పార్కులో వాకింగ్‌ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని మఫ్టీలో ఉండి పది మంది గూండాల మాదిరిగా ఎత్తుకు వెళ్తే అది అరెస్టంటరా? లేక కిడ్నాపా?. ఆయనేమైనా టెర్రరిస్టా? నరేందర్‌రెడ్డి భార్యకైనా కనీసం అరెస్టు సమాచారం ఇచ్చిండ్రా? పోలీసులే సమాధానం చెప్పాలి.

రేవంత్‌రెడ్డి అల్లుడికి చెందిన మ్యాక్స్‌ బీన్‌ కంపెనీ విస్తరణ కోసమే కొండగల్‌లో రైతుల భూములు లాక్కుంటున్నారని, తన అల్లుడి కోసమే ముఖ్యమంత్రి భూదందాకు తెరలేపారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ఫార్మా సిటీని వదిలి రేవంత్‌రెడ్డి మూర్ఖ నిర్ణయాలు తీసుకున్న కారణంగానే ప్రజలు తిరగబడుతున్నారని, ఇందులో ఎవరి కుట్రా లేదని స్పష్టంచేశారు. కొడంగల్‌లో ఫార్మా విలేజ్‌ విషయంలో ఆరు నెలల నుంచే ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, భూములను తన్ని తీసుకుంటామని రైతులను సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి బెదిరించిన ఆడియో తమ వద్ద ఉన్నదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి భరతం పట్టేపని కొండగల్‌ నుంచే ప్రారంభిస్తామని హెచ్చరించారు. రైతులను లాకొచ్చి అర్ధరాత్రి అరెస్టు చేశారని, ఇంట్లో వేడుకలు, కార్యక్రమాలు ఉన్నా ఇంటర్నెట్‌ బంద్‌ పెట్టి రైతులను అరెస్ట్‌ చేసి వాళ్లను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేబీఆర్‌ పార్కులో వాకింగ్‌ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని మఫ్టీలో ఉండి పది మంది ఎత్తుకు వెళ్లారని, అది అరెస్టా? లేక కిడ్నాపా? అని ప్రశ్నించారు. పీడిత గిరిజన రైతులకు తాము అండగా నిలబడతామని, న్యాయస్థానాల్లో వారి తరఫున కొట్లాడతామని స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో బుధవారం మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, నేత మన్నె క్రిశాంక్‌తో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

ఫార్మారంగ నిపుణుల కేంద్రం ఐడీపీఎల్‌
హైదరాబాద్‌లో నెలకొల్పిన ఐడీపీఎల్‌ సంస్థనే అనేక మంది ఫార్మారంగ నిఫుణులను తయారుచేసిందని కేటీఆర్‌ చెప్పారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 1956లో ఏర్పడిన తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ గొప్ప ఉదాత్తమైన ఆశయంతో భారతదేశం స్వావలంబన సాధించాలి.. అన్ని రంగాల్లో దేశం ముందుండాలని కొన్ని ఆలోచనలు చేశారు. పంచవర్ష ప్రణాళికలు, వివిధ రంగాల నిఫుణులతో సలహాలు సూచనలకు కమిటీలు వేశారు. దేశం స్వావలంబన, స్వయంసమృద్ధి సాధించడానికి పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్‌లో కొన్ని కంపెనీల ఏర్పాటుకు చోటుకల్పించారు. భారతదేశం ఉజ్వలంగా, ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా ఎదగడానికి చాలారంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఫార్మాస్యుటికల్స్‌, లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి సంబంధిం చి అప్పటి ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీ సుకున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఇండియన్‌ డ్రగ్స్‌ ఫార్మాస్యుటికల్స్‌ లిమిటెడ్‌(ఐడీపీఎల్‌)ను ఏర్పాటు చేశారు. దేశంలోనే రీసెర్చ్‌ జరగాలనే ఉద్దేశంలో ఐడీపీఎల్‌ను నెలకొల్పారు. ఆ సంస్థ ఎంతోమంది ఫార్మారంగ నిపుణులను తయారు చేసింది. ఫార్మాస్యుటికల్‌ రంగంలో పేరు కలిగిన అనేక మంది ఈ సంస్థ నుంచి వచ్చినవారే. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు అంజిరెడ్డి, ఎంఎస్‌ఎస్‌ రెడ్డి, హెటిరో పార్థసారథిరెడ్డి.. వీళ్లంతా ఐడీపీఎల్‌ నుంచే వచ్చారు’ అని కేటీఆర్‌ వివరించారు.

‘ఫార్మాస్యుటికల్‌’లో 40% వాటా మనదే
దేశ ఫార్మాస్యుటికల్స్‌ రంగంలో 40 శాతం వాటా తెలంగాణదేనని కేటీఆర్‌ వెల్లడించారు. ‘ఫార్మాస్యుటికల్‌ రంగానికి హైదరాబాద్‌ మహానగరం కేరాఫ్‌గా మారింది. దేశంలో ఒక లీడర్‌ గా ఎదిగింది. కొవిడ్‌ సమయంలో పారాసిటమల్‌ కోసం ప్రపంచం మొత్తం మనవైపే చూ సింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి మీ దేశంలో ఫార్మాస్యుటికల్స్‌ చాలా విస్తారంగా ఉన్నాయి. మాకు పారాసిటమల్‌ ట్యాబ్లెట్లు కావాలని అడిగారు. అప్పటి మన సీఎం కేసీఆర్‌కు ఫోన్‌చేసి వాళ్ల అధికారులు అడిగారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఫార్మారం గం అభివృద్ధి, విస్తరణ కోసం కేసీఆర్‌ లోతుగా చర్చించారు. క్యాబినెట్‌లోగాని, శాసనసభ స మావేశాల్లోగాని, బహిరంగ సభలోగాని, పం చాయితీలు పెట్టుకోవద్దు.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం కోసం ము ందుకు సాగాలి.. గత ప్రభుత్వాలు మంచిపని చేసి ఉండొచ్చు. వాటిని ముందుకు తీసుకెళ్లాలి. అవనసరమైన వాటిని కంట్రోల్‌ చేయాలి. మన పిల్లలకు ఉపాధి అవకాశాలు పెంచాలి. సమస్య లు పరిషరించాలి. పెట్టుబడులు ఆహ్వానించాలన్న ఇంటిగ్రేటెడ్‌ ఆలోచనతో కేసీఆర్‌ ముందుకుసాగారు. ఆ సందర్భంలోనే చైనాలో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమ్మిట్‌కు ఆహ్వానం వచ్చింది. నాటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, పారిశ్రామికవేత్తలు, అధికారులను ను తీసుకొని కేసీఆర్‌ సదస్సుకు వెళ్లారు.

ప్రపంచానికే చైనా మ్యానుఫ్యాక్చరింగ్‌ కేంద్రం
ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్‌ కేంద్రంగా చైనా మారిందని కేటీఆర్‌ చెప్పారు. ‘చైనా ప్ర పంచ ఉత్పత్తి కేంద్రంగా ఎలా మారిందో అర్థం చేసుకోవడానికి రెండు రోజులపాటు అక్కడే అధికారులు, ప్రజాప్రతినిధుల బృందంతో కేసీఆర్‌ పర్యటించారు. సిచువాన్‌ ఇండస్ట్రియల్‌ పార్‌ను సందర్శించారు. అది ఎంత పెద్ద పార్‌ అంటే 70 వేల ఎకరాల్లో విస్తరించింది. ఇంత పెద్ద విస్తీర్ణంలో ఎలా పెట్టారని వారిని అడిగితే.. ఎవరిపాటికి వాళ్లు యూనిట్లు ఎకడపడితే అకడ చెట్టుకొకరు పుట్టకొకరు పెడి తే.. ఎవరికివాళ్లు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, పొ ల్యూషన్‌ నివారణ పిట్లు.. ఎక్కువవుతాయి. ఖర్చు ఎక్కువవుతుంది. ఒకే దగ్గర పెడితే కామన్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీస్‌ ఖర్చు తగ్గుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకొనేందుకు అవకాశం ఏర్పడుతుంది. పొల్యూషన్‌ కూడా పూర్తిగా నివారించవచ్చు’ అని చైనా ఆధికారులు వెల్లడించినట్టు కేటీఆర్‌ వివరించారు.

నగరం చుట్టూ ఇండస్ట్రియల్‌ పార్కులు
హైదరాబాద్‌ చుట్టూ పారిశ్రామికవాడలు వెలిశాయని, తద్వారా కాలుష్యం పెరుగుతున్నదని ప్రజలు ఆందోళనలు చేపట్టే పరిస్థితి వ చ్చిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘రామచంద్రపురం, జీడిమెట్ల, పాశమైలారం, పటాన్‌చెరు, నాచారంలో పరిశ్రమలు పెట్టారు. నాడు ఇంత ఆధునిక టెక్నాలజీ లేదు. ఇప్పుడు వచ్చింది. ఫార్మా యూనిట్‌ పక్కనే ఉన్నదన్న విషయం తెలియకుండా సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. ఫార్మాస్యుటికల్‌ ఇండస్ట్రీకి హైదరాబాద్‌ అప్పటికే కీలక స్థావరంగా ఉన్నది. పెద్ద కంపెనీలు, పారిశ్రామికవేత్తలు పిలిచి మాట్లాడారు. చైనా తరహా పెద్ద ఎత్తున ఫార్మాసిటీ ఏర్పాటు చే యాలని ముచ్చర్లకు మూడు హెలికాప్టర్లలో అ ధికారులు, ప్రజాప్రతినిధులను తీసుకొని వెళ్లాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ ఒకచోట పెట్టాలని దాని చుట్టుపకల 5-10 కి.మీ పరిధి వరకు రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్లు రాకుండా చూడాలని నిర్ణయించాం. 50 ఏండ్ల తర్వాత వచ్చే ప్రభుత్వానికి కూడా తలనొప్పి ఉండొద్దనే ఉద్దేశంతో ఎనిమిదేండ్లు కష్టపడి 14 వేల ఎకరాల భూమిని సేకరించిపెట్టాం. అందులో గవర్నమెంట్‌ ల్యాండ్‌ ఉన్నది. కొం త ప్రైవేట్‌ ల్యాండ్‌ ఉన్నది’ అని వెల్లడించారు.

చేజింగ్‌ సెల్‌ ఇన్‌చార్జిగా శాంతికుమారి
తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఫార్మారంగంలో ఇంకా విస్తరించాలనే ఉద్దేశం తో నేటి సీఎస్‌ శాంతికుమారిని నాడు చేజింగ్‌ సెల్‌ ఇన్‌చార్జిగా కేసీఆర్‌ నియమించినట్టు కేటీఆర్‌ గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్శించడానికి, పోటీ ప్రపంచంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలపడానికి చేజింగ్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సీఎం ఆధ్వర్యంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఇండస్ట్రీ సెక్రటరీ ఇతర అధికారులను వివిధ దేశాలకు ఫార్మా సంస్థల పరిశీలనకు పంపించినట్టు పేర్కొన్నా రు. ఎన్నికల తర్వాత ఫార్మాసిటీకి అంకురార్ప ణ చేయాలని భావించనట్టు వివరించారు. 14 వేల ఎకరాల్లో 8వేల ఎకరాల పైచిలుకు భూ ములు ప్రైవేటువి కాగా, పరిహారం విషయం లో రైతులు అసంతృప్తిగా ఉన్నట్టు కొందరు నాయకులు కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారని చెప్పా రు. బాధిత రైతులకు విలువైన ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి స్థలం కేటాయించాలని నిర్ణయించి, 500 ఎకరాల్లో రైతులకు పట్టాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇన్ని విధాలుగా ఆలోచించి, భూములిచ్చిన రైతులు, పేదలకు అన్యాయం జరగకుండా చేశామని గుర్తుచేశారు. కానీ, రేవంత్‌రెడ్డి మూర్ఖపు విధానాల వల్లే కొడంగల్‌ ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారని విమర్శించారు.

తన్ని తీసుకుంటమన్నది నిజం కాదా?
కొడంగల్‌ ఘటనలో కుట్ర కోణం ఏమీ లే దని, సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత, మూర్ఖపు విధానాల వల్లే అక్కడ గొడవ జరిగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. 7-8 నెలల క్రితం కూడా భూముల సేకరణపై కొడంగల్‌ రైతులు రోడ్డెక్కారని గుర్తుచేశారు. నాడు ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డికి ఓ రైతు ఫోన్‌చేసి తమ భూములు ఎందుకు తీసుకుంటారు? అని నిలదీయగా.. ‘ప్రభుత్వాన్ని గట్టిగా అడిగితే తన్ని తీసుకుంటం.. రా నా కొడకా’ అని హెచ్చరించారని తెలిపారు. నాటి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందని చెప్పారు. నాటి నుంచి తమను బాధిత రైతులు అనేకసార్లు కలిశారని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని బీజేపీ నాయకులను కూడా రైతులు కలిశారని పేర్కొన్నారు. బలవంతంగా భూముల సేకరణ మంచిది కాదని, ఆ ఆలోచన విరమించుకోవాలని తాము ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు.

మానవత్వం మరిచిన ప్రభుత్వం
‘ఇండ్ల మీద, పొలాల మీద పడి తీవ్రవాదులను అరెస్టు చేసినట్టు రైతులను అరెస్టు చేస్తా రా? హరీశ్‌ అనే ఒక రైతు కొడుకు పుట్టినరోజు ఇవ్వాళ.. ఓ తల్లికి కొడుకు వైద్యం చేయించాలి. ఓ రైతు కూతురు అన్న ప్రాసన ఇవ్వాళ.. పరీక్ష రాయాల్సిన పిల్లగాడిని కూడా ఎత్తుకుపోయారు. వాళ్లంతా ఏడుస్తున్నారు. పేపర్‌లో చూస్తే బాధనిపిస్తున్నది. అందుకే అంటున్న ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం. మట్టిమనుషుల మీద వికృతాన్ని చూపిస్తున్న క్రూర ప్రభుత్వం’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.

మెడికవర్‌’ ప్రారంభానికి వెళ్లిన సీఎం
వరంగల్‌లో గతంలో మెడికవర్‌ అనే ప్రైవే ట్‌ హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో వెళ్లారని కేటీఆర్‌ గుర్తుచేశారు. ‘వరంగల్‌లో ప్రభుత్వ ఎంజీఎం దవాఖాన ప్రారంభోత్సవానికి వెళ్లలేదు. ఎంజీఎం లో ఆరు గంటల కరెంటు పోతే పట్టించుకోలేదు. కానీ ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి సీఎం హెలికాప్టర్‌లో వెళ్లారు. ఇంత ప్రేమ వెనుక ఏమిటా కథ? అని తవ్వి చూస్తే.. అన్నం శరత్‌, సత్యనారాయణరెడ్డి ఇద్దరు మ్యాక్స్‌ బీన్‌ ఫార్మా కంపెనీ కో డైరెక్టర్లు. ఇటీవల బెంగళూరులో మెడికవర్‌ హాస్పిటల్‌ యూనిట్‌ పెట్టగా, అక్కడి కాంగ్రెస్‌ నేత, డిప్యూటీ సీఎం శివకుమార్‌ ప్రారంభించారు. ఫార్మా విలేజ్‌ల పేరిట జరుగుతున్న వికృత భూసేకరణ ఏదైతే ఉందో, దీని వెనుకాల ఎవరు ఉన్నారో ప్రజలు అర్థం చేసుకుంటారని ఇదంతా చెప్తున్న. ఫార్మాసిటీ రద్దుచేసి రాష్ట్రమంతటా ఎందుకు ఫార్మా విలేజీలో పెడుతున్నారో మీకు అర్ధమై ఉంటుంది?’ అని కేటీఆర్‌ వివరించారు. బెంగళూరు మెడికవర్‌ హాస్పిటల్‌ను శివకుమార్‌ ప్రారంభిస్తున్న ఫొటోను కేటీఆర్‌ మీడియాకు చూపించారు.

ప్రశ్నించే గొంతుక అనే కదా గెలిచింది?
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే తప్పా అని కేటీఆర్‌ నిలదీశారు. ‘ప్రశ్నించే గొంతుక అని చెప్పే కదా నువ్వు గెలిచింది. మరి ఇప్పు డు ఎందుకు ప్రశ్నించే వాళ్లను అరెస్ట్‌ చేస్తున్న రు? రైతులు తమ భూములు కాపాడాలని కోరుతూ అందరినీ కలిశారు. ఒక కేసీఆర్నే.. నరేందర్‌రెడ్డినే కలవలేదు. సీఎం బిజీగా ఉండటంతో ఆయన సోదరుడు తిరుపతిరెడ్డిని కూడా కలిశారు. కలెక్టర్‌ జైన్‌ను కూడా కలిశా రు. తమ భూములు కాపాడాలని మొరపెట్టుకున్నారు. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏమంటే.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు.. భూమిని గుంజుకున్నా కూడా ఎవరూ ప్రశ్నించ కూడదన్నట్టు.. మేము చేసిన దానికి సాగిలబడాలన్నట్టు.. ఫార్మా విలేజ్‌ల పేరిట జరుగుతున్న బాగోతాన్ని ఎవరు ప్రశ్నించకూడదన్నట్టు.. నీ అనాలోచిత విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తారా? మేము ఖచ్చితంగా గొంతు విప్పి ప్రశ్నిస్తాం.. ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని కేటీఆర్‌ స్పష్టంచేశారు.

అదానీతో నువ్వెందుకు కలుస్తున్నవ్‌?
‘సురేశ్‌ మమ్మల్ని కలవడం తప్పయితే.. దేశాన్ని దోచుకుంటున్నాడని రాహుల్‌గాంధీ వ్యతిరేకించే అదానీని నవ్వెందుకు కలుస్తున్నా వ్‌’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘సురేశ్‌, నన్ను నరేందర్‌రెడ్డిని కలవటమే తప్పయితే రాహుల్‌గాంధీ వ్యతిరేకించే అదానీతో రేవంత్‌ రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. మరి దానికి రేవంత్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలి కదా? సురేశ్‌ ఏం తప్పు చేశాడు. మన నాయకులతో ఫోన్‌లో మాట్లాడటమే తప్పా? ఆయ న భూమి పోతుంటే మాట్లాడకూడదా? సురేశ్‌ను దాడిచేయాలని నరేందర్‌రెడ్డి చెప్పిండా? మీ మూర్ఖపు ఆలోచన మానుకోండి? ఫార్మా విలేజ్‌ల పేరిట రాష్ట్రమంతా రావణకాష్టం చేస్తామంటే ఊరుకోం’ అని హెచ్చరించారు.

మీ అల్లుడి బాగోతం చెప్తాం
‘మీ అల్లుడి బాగోతం, మీ ఫార్మా కంపెనీల బాగోతం ప్రజలకు వెల్లడిస్తూనే ఉంటాం. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న మీ కుటుంబసభ్యుల సంస్థల వివరాలను ఎప్పటికప్పుడు ధారావాహికంగా చెప్పి ప్రజల దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఫార్మాసిటీని రద్దుచేసి భూములను తిరిగి ఇస్తామని చెప్పడంతో కందుకూరు, ముచ్చర్ల రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆ భూములు ఎప్పుడు రైతులకు తిరిగిస్తారో సమయం, తేదీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

అధికారులు బలికావద్దు..
ప్రభుత్వ కుట్రలో అనవసరంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు బలికావద్దని కేటీఆర్‌ సూచించారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల అధికారులు ఇరుకున పడుతున్నారన్నారు. కొడంగల్‌ ఘటన ఈ రోజు జరిగినది కాదని, 6-7 నెలలుగా ఆ ప్రాంత రైతులు నిరసన తెలుపుతూనే ఉన్నారని చెప్పారు. ఆ రైతులను పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో కూడా భూసేకరణ చేశామని, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లో సమస్యలు వస్తే వెంటనే నాడు ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి రైతులను పిలిచి మాట్లాడి ఒప్పించారని గుర్తుచేశారు. కోర్టుకు వెళ్తే అక్కడ కూడా ఒప్పించామని, కోట్ల ఆదాయం, రైతులకు లాభం తెచ్చి పెట్టే ప్రాజెక్టు గురించి వివరించి భూములు సేకరించామని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రియల్‌ ఎస్టేట్‌ ఫార్ములానే తెలుసు..
‘ముఖ్యమంత్రికి రియల్‌ ఎస్టేట్‌ ఫార్ములా, బ్యాగుల ఫార్మూలా తప్ప ‘ఫార్ములా ఈ-రేస్‌’ అంటే ఏం తెలుసు?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ’11 నెలలుగా రోజుకో కుంభకోణం పేరుతో టైమ్‌ పాస్‌ ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీడియా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మేము తప్పకుండా లగచర్ల రైతులకు అండగా ఉంటాం. ఆ ప్రాంతానికి మా పార్టీ నాయకులం వెళ్తాం. పీడిత, గిరిజన రైతులకు మేము కచ్చితంగా అండగా నిలబడతాం. లంబాడా హకుల సమితి వాళ్లను కూడా కలిసి వాళ్లతో పోరాటం చేస్తాం. భూ సేకరణ పేరుతో రేవంత్‌రెడ్డి కుటుంబం చేస్తున్న దోపిడీ ప్రజల ముందుపెడతాం. నేను ఢిల్లీకి వెళ్లింది అనుముల కుటుంబ కుంభకోణాలు బయటపెట్టేందుకే. మళ్లీ కూడా కుంభకోణాలను బయటపెడుతూనే ఉంటా’ అని కేటీఆర్‌ స్పష్టంచేశారు.

నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు..
తమను ఉద్ధరిస్తాడని ఎన్నో ఆశలతో కొడంగల్‌ ప్రజలు గెలిపిస్తే వారిని పట్టించుకోకుండా రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ‘కొడంగల్‌లో ఉన్నది మొత్తం లంబాడా రైతులు. గిరిజన పుత్రులు. బాధితులందరూ అధికారులను, ప్రజాప్రతినిధులను అడిగారు. రైతులను పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమే దొరలం. రారాజులం, చక్రవర్తులం. మాది సామ్రాజ్యం.. మేము ఏది అనుకుంటే అది జరగాలనే పద్ధతుల్లో అనాలోచిత, పిచ్చి నిర్ణయం వల్లే కొడంగల్‌ రగులుతున్నది. రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా.. సీఎం తీరు ఉన్నది. కొడంగల్లో ఇవ్వాళ 16 మంది రైతులు అరెస్టయి జైలుకుపోతే.. కొడంగల్‌ ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపించిన ఆ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ఇప్పుడు ఎకడున్నడు? మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ.. వాళ్లకు తాబేదారుగా మారారు. రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతులు అక్రమంగా అరెస్టయి జైలుకు పోతుంటే పట్టించుకోవడం లేదు’ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

నరేందర్‌రెడ్డి ఏమైనా టెర్రరిస్టా?
‘మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు పట్నం నరేందర్‌రెడ్డిని టెర్రరిస్టును ఎత్తుకుపోయినట్టు ఎత్తుకెళ్తరా?’ అని కేటీఆర్‌ నిలదీశారు. అరెస్టు వారెంట్‌ ఉన్నదా? ఆయన భార్యకైనా సమాచారం ఇచ్చారా? అని ప్రశ్నించారు. కేబీఆర్‌ పార్కులో వాకింగ్‌ చేస్తున్న వ్యక్తిని మఫ్టీలో వచ్చి ఎత్తుకుపోతరా? ఆయన ఏమైనా బందిపోటా? తీవ్రవాదా? అని ఫైరయ్యారు. అది అరెస్టా? కిడ్నాపా? అని ప్రశ్నించారు. పట్నం నరేందర్‌రెడ్డిని ఎలా అరెస్టు చేశారు? ఏ రూల్‌ ప్రకారం ఎత్తుపోయారు.. ఆ రాజ్యాంగం ఏదో చెప్పండి? అని నిలదీశారు. ఇంత అక్రమంగా అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏమెచ్చిందని, రేవంత్‌రెడ్డిపై గెలిచిన మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిపై టెర్రరిస్టు ఆపరేషన్‌ ఏమిటని మండిపడ్డారు. ‘ప్రజల మధ్యకు వచ్చి.. రైతుల మధ్య కూర్చొని నీ ఆలోచనలు వారికి చెప్పి ఒప్పించి భూసేకరణ చేయాలి’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

భూమి గుంజుకుంటే చూస్తూ ఊరుకోవాలా?
30-40 లక్షల విలువైన భూమిని 4-5 లక్షలకు ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కొడంగల్‌లో ఫార్మా విలేజ్‌ ఏర్పాటు కారణంగా సురేశ్‌ అనే బీఆర్‌ఎస్‌ కార్యకర్త ఏడెరాల భూమి పోతున్నదని,విలువైన భూమి పోతుందంటే అడగడం తప్పా? అని ప్రశ్నించారు. కలెక్టర్‌ అభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు రైతుల బాధలను సురేశ్‌ వివరించి, కలెక్టర్‌ సురేశ్‌ జైన్‌కు తెలుగు వస్తదో రాదోనని మూడు భాషల్లో కలెక్టర్‌కు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. రైతులు అక్కడ ఉంటే మీటింగ్‌ ఇక్కడ పెట్టుడేంది.. సార్‌ రైతులను కలవండి సార్‌.. అని చాలా మర్యాదగా వివరించినట్టు పేర్కొన్నారు. ‘ఎకడ కూడా దాడి చేయలేదు. సురేశ్‌ దాడికి పాల్పడినట్టు ఏమైనా ఆధారాలున్నాయా? కడుపు మండి తన భూమి గురించి అడిగాడు. కలెక్టర్‌కు అకడి రైతుల సమస్యను వివరించాడు. మా పార్టీ నాయకులు మా వారితో మాట్లాడితే అది కూడా తప్పా? దానికి కేసులు పెడతారా?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

నాడు రైతులను రెచ్చగొట్టిన కాంగ్రెస్‌ నేతలు
ఎనిమిదేండ్లు కష్టపడి ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాల భూమిని సేకరిస్తే నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు ప్రజలను, రైతులను రెచ్చగొట్టారని కేటీఆర్‌ విమర్శించారు. ‘ఇదే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార అకడికి వచ్చి.. ఫార్మాసిటీ మీ దగ్గరకు వస్తే ఊర్లు కలుషితమైపోతయ్‌. నాశనమైపోతయ్‌. మీ భూములు తీసుకొని ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుందని నోటికొచ్చినట్టు, సబ్జెక్ట్‌ తెలియకుండా, పరిజ్ఞానం లేకుండా మాట్లాడారు. ఎనిమిదేండ్లు కష్టపడి 13-14 వేల ఎకరాలు సేకరించి బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తే.. అనాలోచితంగా ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్‌రెడ్డి ఫార్మాసిటీ రద్దయిపోయిందన్నారు. ఫార్మాసిటీ కోసం భూములిచ్చాం.. అది రద్దు అయింది కాబట్టి మా భూములు తిరిగివ్వాలని పెద్ద రైతులు లక్ష్మారెడ్డి, కోదండరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పైగా కోర్టుకు కూడా వెళ్లారు. ఫార్మాసిటీ ఉన్నదని కోర్టుకు ప్రభుత్వం చెప్పింది. ఫార్మాసిటీ అనే పేరు కొనసాగిస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని ఫార్మా విలేజ్‌గా రేవంత్‌రెడ్డి పేరు మార్చారు. 20 చోట్ల స్థలం సేకరించడం మాకు తెలియక కాదు. ఒక పరిజ్ఞానం లేక కాదు. హైదరాబాద్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ లైఫ్‌సైన్స్‌ సెంటర్‌ లీడర్‌ ఉండాలని ఒకేచోట ఫార్మా కంపెనీలు నెలకొల్పాలనే ఆ నిర్ణయం తీసుకున్నాం. 2030 సంవత్సరం కల్లా 100-200 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి తెలంగాణకు రావాలి. అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీని స్థాపించాలి.. ఇలా అనేక అంశాలను ఆలోచించి భూమిని సేకరించి పెట్టాం’ అని కేటీఆర్‌ తెలిపారు.

రేవంత్‌ అనుయాయుల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఇప్పటికే రోడ్డు ఉండగా, కొత్తగా 340 ఫీట్ల రోడ్డు వేయడంపై రైతులు మండిపడుతున్నారని కేటీఆర్‌ చెప్పారు. అక్కరలేని రోడ్డు వేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దగ్గరకు వచ్చి రైతులు మొరపెట్టుకున్నారని తెలిపారు. అక్కడ ఏమి జరుగుతున్నదని కూపీలాగితే ఆ సమీప ప్రాంతాల్లో రేవంత్‌రెడ్డి అనుయాయులు భూములు కొంటున్నరని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రియల్‌ ఎస్టేట్‌ బాగోతం బయటపెడతామని, ఆ బాధ్యత తామే తీసుకుంటామని చెప్పారు. కొడంగల్‌ నుంచి రేవంత్‌రెడ్డి భరతం పట్టే చర్యలు మొదలు పెడతామని హెచ్చరించారు. అవసరమైతే తమ పార్టీ తరపున నాయకులమంతా అక్కడికి వస్తామని, రైతులకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉన్నదని, కోర్టుల్లోనూ కొట్లాడతామని చెప్పారు. బడుగు బలహీనవర్గాల తరఫున కోర్టుల్లో కొట్లాడే బాధ్యత కూడా తామే తీసుకుంటామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మూర్ఖపు ఆలోచన విరమించుకోవాలని హితవుపలికారు.

పిల్లిని గదిలో బంధించి కొడితే తిరగబడ్తది..
తొమ్మిది నెలలుగా రైతులు ఆందోళన చేసుంటే పిలిచి మాట్లాడే సమయం లేదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన సొంత నియోజకవర్గ ప్రజలతో మాట్లాడే సమయం రేవంత్‌రెడ్డికి చిక్కడం లేదా? అని నిలదీశారు. ‘కలెక్టర్‌కు టైమ్‌ దొరకలేదు.. తిరుపతిరెడ్డికి టైం లేదు.. ముఖ్యమంత్రికి టైం లేదు.. ఏం చేస్తున్నారు బిజీగా ఉన్నారా?’ అని ప్రశ్నించారు. పిల్లిని గదిలో బంధించి కొడితే ఎదురు తిరుగుతుందని.. రైతులు కూడా అలాగే తిరగబడ్డారని పేర్కొన్నారు. కలెక్టర్‌ దాడి జరగలేదని చెప్తే.. ఐజీ దాడి జరిగినట్టు ఎలా అంటారని నిలదీశారు. నిఘా వ్యవస్థ వైఫల్యమని, దాడి జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ ఏదీ? అని నిలదీశారు. ఉద్దేశ పూర్వకంగా గొడవ సృష్టించి రైతులు భూసేకరణకు సహకరించటం లేదని చెప్పి భూములను గుంజుకునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ‘తన భూమి పోతున్నదని సురేశ్‌ నన్ను కలిస్తే నాపై కేసు పెడుతారా?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

ఇది ప్రభుత్వ భూదాహం
తన అల్లుడి ఫార్మా కంపెనీ విస్తరణ కోసమే రేవంత్‌రెడ్డికి భూ దాహమవున్నదని కేటీఆర్‌ విమర్శించారు. ‘2020లో ఏర్పాటైన మ్యాక్స్‌ బీన్‌ అనే ఫార్మా కంపెనీకి గొలుగూరి సత్యనారాయణరెడ్డి డైరెక్టర్‌-ప్రమోటర్‌.. ఈ సత్యనారాయణరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్వయానా అల్లుడు. తన బిడ్డను ఇచ్చారు. ఈ కంపెనీ విస్తరణ కోసం ఫార్మా విలేజ్‌లో భూములు తీసుకోవడానికి, అల్లుడికి సహకరించడానికే రేవంత్‌రెడ్డి ఇదంతా చేస్తున్నారు.. మ్యాక్స్‌ బీన్‌ అనే ఫార్మాకు మరో డైరెక్టర్‌ ఉన్నారు. ఆయన పేరు అన్నం శరత్‌. సహృదయ హెల్త్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీకి కూడా శరత్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

భూములు ఇవ్వకపోతే కొడ్తరా?
ఫార్మా విలేజ్‌కు రైతులు భూములు ఇవ్వకపోతే కొడ్తరా? అని కేటీఆర్‌ నిలదీశారు. ‘నరేందర్‌రెడ్డితోపాటు 16 మంది రైతులను వెంటనే విడుదల చేయాలి. రైతులు నడవలేక పోతున్నరు. కచ్చితంగా పోలీసులు వారిని కొట్టారు. మెడికో లీగల్‌ పరీక్షలు చేయించాలి. ప్రభుత్వ వైద్యులపై నమ్మకం లేదు. ప్రైవేట్‌ వైద్యులతో చేయించండి. కొడంగల్‌ రైతులు భయపడకండి. మీ పక్షాన మేముంటాం. కోర్టులో తప్పకుండా కొట్లాడుదాం. కోర్టులో తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం’ అని పేర్కొన్నారు.

హైకోర్టును కూడా మోసం చేస్తున్నవ్‌..
హైకోర్టును కూడా ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నదని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తమ భూములను ఫార్మా సిటీకి కేటాయిస్తున్నారా? దేనికి కేటాయిస్తున్నారని హైకోర్టుకు ముచ్చర్ల, కందుకూరు రైతులు వెళ్తే కోర్టుకేమో ఫార్మాసిటీ ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. కానీ, బయట మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓసారేమో ఫ్యూచర్‌సిటీ, మరోసారి ఫోర్త్‌సిటీ, ఏఐ సిటీ, ఇంకోసారి స్కిల్‌ యూనివర్సిటీ అంటున్నరు. ఇవన్నీ పెడతానంటున్న రేవంత్‌ సర్కారు ఒక్క ఎకరం భూమైనా సేకరించిందా?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు కండిషనల్‌ భూములని, ఫార్మాసిటీకి కేటాయించిన భూమిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తే భూ కేటాయింపులు రర్దవుతాయని పేర్కొన్నారు.
ఫార్మా విలేజ్‌ వద్దని కొడంగల్‌ రైతులు సీఎంను, మమ్మల్ని, బీజేపీ వాళ్లను కూడా కలిసిండ్రు. సురేశ్‌ అనే వ్యక్తి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తనే.. తన విలువైన భూమి పోతుంటే అడగడం తప్పా?. కొడంగల్‌ రగలుతుండటానికి సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలే కారణం. రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించిన చందంగా.. సొంత నియోజకవర్గంలో రైతులు అరెస్టవుతుంటే రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లిండు.
-కేటీఆర్‌

దళిత, గిరిజన, బీసీల భూములను లాక్కొని తన అనుయాయులకు, కుటుంబసభ్యులకు ఇచ్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో కోట్లు సంపాదించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది. ఇది కాంగ్రెస్‌ ప్రజాపాలన కాదు. ఇందిరమ్మ రాజ్యం అసలే కాదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్నది. ఈ మాట ఊరికే అనడం లేదు. ఇంటర్నెట్‌ను తొలగించారు. బంద్‌ పెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం..
ఇంటర్నెట్‌ను ఇట్లా నిషేధించడం కరెక్ట్‌ కాదు.
-కేటీఆర్

Leave A Reply

Your email address will not be published.

Breaking