టిడిపి సభ్యత నమోదు
పిఎసిఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్
మాడుగులపల్లి, అక్షిత ప్రతినిధి :
మండల పరిధిలోని ఇసుక బావిగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పార్టీ నూతన రెన్యువల్ సభ్యత్వలు పార్లమెంట్ అడహక్ కమిటీ సభ్యులు పిఎసిఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్,మాజీ పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జనిమియాలు కలిసి ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ పార్టీ సభ్యత నమోదు చురుకుగా సాగుతుందని తెలిపారు రేపు రాబోవు రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సామాన్య మానవునికి అందుబాటులో ఉండే విధంగా మాండలిక వ్యవస్థను తీసుకువచ్చిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కిందని కొనియాడారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం వలన కార్యకర్తకు ఐదు లక్షల ప్రమాద బీమా పథకం వర్తిస్తుందని కార్యకర్త మరణించినట్లయితే పదివేల రూపాయల మట్టి ఖర్చులకు గాను అందజేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజి మండల పార్టీ అధ్యక్షులు షేక్ రసూల్, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కట్ట అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.