పత్రికా స్వేచ్ఛను కాపాడుకుందాం
మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
పత్రికా స్వేచ్ఛను కాపాడడం అందరి బాధ్యత అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లాకు వచ్చిన ఆయన తొలిసారిగా వచ్చిన సందర్భంగా నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్
కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. నవంబర్ 6న జాతీయ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన రోజు నుంచి జాతీయ పత్రికా దినోత్సవం పరిగణిస్తున్నామని చెప్పారు.
దేశవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పత్రిక అంతర్భాగమన్నారు.
దేశంలో పత్రిక స్వేచ్ఛ మనుగడకు ఆటంకం కలిగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పులిమామిడి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాదె రమేష్, కోశాధికారి దన్నంపల్లి రవికుమార్, ప్రెస్ క్లబ్ సభ్యులు నీలకంఠ మధు, పెద్దగోని మధు, కత్తుల హరి తదితరులు పాల్గొన్నారు.