ఏటీసీ నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్ 

ఏటీసీ నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్ 

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటిఐ ఆవరణలో నిర్మిస్తున్న బాలుర అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కేంద్రాన్ని డిసెంబరు 4 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె ఏటీసీ నిర్మాణాన్ని పరిశీలించారు.టాటా కన్సల్టెన్సీ తో బాలురు, బాలికల ఏటీసీ కేంద్రాల నిర్మాణాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డిసెంబర్ 4లోగా బాలుర స్కిల్ సెంటర్ ను పూర్తి చేయాలని, డిసెంబర్ 5 నఈ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.

అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ ,ఇంజనీరింగ్ అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking