తుది దశకు సర్వే 

తుది దశకు సర్వే 

డేటా ఎంట్రీ ముఖ్యం 

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

సామాజిక, ఆర్థిక, విద్య ,ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల డేటా ఎంట్రీ చాలా ముఖ్యమని , పూర్తి జాగ్రత్తగా వివరాలను డేటా ఎంట్రీ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.ఆదివారం ఉదయం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచి నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, ఇక డేటా ఎంట్రీ పై దృష్టి సారించాలని, ముఖ్యంగా పూర్తి నాణ్యతతో డేటా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో డోర్ లాక్, ఇతర కారణాల వల్ల ప్రజలు ఇళ్ల వద్ద అందుబాటులో లేనట్లయితే ఫోన్ ద్వారా వివరాలు సేకరించి అలాంటి సర్వే వివరాలను క్రమబద్ధీకరించు కోవాలని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాలలో సైతం వలస వెళ్లిన వారి వివరాల నమోదు పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.ఇటీవల కొన్ని వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోఫుడ్ పాయిజన్ సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని, ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరిశుభ్రత తో పాటు, ఆహారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎక్కడ ఆహారం కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చూడాలని , ఈ విషయంపై త్వరలోనే సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఈ- జిల్లా మేనేజర్ దుర్గారావు, సిపిఓ వెంకటేశ్వర్లు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking