మోగిన విద్యార్ధి భేరి
సమస్యల సాధనకై పోరు
కూరెళ్ళ మహేష్
హనుమకొండ, అక్షిత ప్రతినిధి :
విద్యార్థుల సమస్యల సాధనకు సమర శంఖం పూరించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయoబర్స్ మెంట్, డైట్ బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై సమర భేరి మోగించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన మరింత ఉదృతం చేస్తామని తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూరెళ్ల మహేష్ హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూరెళ్ల మహేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దామల్ల సత్యం ఆధ్వర్యంలో హనుమకొండ పట్టణంలో విద్యార్థుల భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రధాన డిమాండ్స్ గా మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డైట్ బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. వసతి గృహాలకు పెంచిన మెస్ ఛార్జీలను వెంటనే అమలు చేయాలన్నారు. హనుమకొండ పట్టణంలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నయీమ్ నగర్ నుండి బాలసముద్రం, కలెక్టరేట్, పట్టణ నలుమూలల నుండి విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించే ప్రదర్శన విద్యార్థుల సమస్యలను ప్రభుత్వానికి తెలిసేలా గర్జించారు.
ఈ ర్యాలీలో విద్యార్థులు పలు కళాశాల విద్యార్థి విద్యార్థునిలు పాల్గొని పెద్ద ఎత్తున హనుమకొండ పట్టణంలో ర్యాలీ విజయవంతం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి విద్యార్థులకు పెండింగ్లో ఉన్న సంక్షేమ వసతి గృహాల డైట్ బిల్లులు, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ను, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్ మెంట్ లను విడుదల చేసి విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజి యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించిన రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ విద్యాసంస్థలు కూడా స్తంభించే పరిస్థితి ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మొద్దు నిద్రను వదిలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిరంకుశంగా కాకుండా వారి పట్ల ప్రేమ చూపించి వారికి విడుదల చేయాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ ఈరోజు పట్టణంలో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. అనంతరం విద్యార్థులతో ఈ సమావేశంలో తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూర్రెల్ల మహేష్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దామల సత్యం , రాష్ట్ర నాయకులు గోవింద్ రాజు, రాష్ట్ర నాయకులు ఈర్ల ప్రసాద్, యాదాద్రి భువనగిరి ప్రెసిడెంట్ సుధాకర్,గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మేడి నాగరాజు, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ యన్నమల్ల ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ నిర్మల సతీష్ మహాజన్, జనరల్ సెక్రెటరీ కూరెళ్ళ ఉదయ్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ తాటిపాముల తరుణ్, ఆదర్శ్ ,విజయ్ కుమార్, హనుమకొండ జిల్లా మహిళా ఇన్చార్జ్ శ్రీ లక్ష్మీ ప్రసన్న , స్వాతి, పద్మావతి, సరళ, స్వరూప, దివ్య, రమ, పద్మ, భాగ్య, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.