మల్లూరు హేమాచల లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో జన సందడి
మంగపేట, అక్షిత న్యూస్ :
ములుగు జిల్లా మంగపేట మండలంలోని రెండవ యాదాద్రిగా ప్రసిద్ధి చెందిన మల్లూరు హేమచల లక్ష్మి నరసింహ స్వామి పుణ్యక్షేత్రమును శని ఆదివారాలు సెలవు దినం అయినందున సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కలు చెల్లిస్తు భక్తులతో హేమ శాల లక్ష్మి నరసింహ స్వామి ప్రాంగణం జన సందడిగా మారింది.
దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలుకుతూ, భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యం కలిగేలా ప్రత్యేక పూజలను, నిర్వహించారు. కార్తీక మాసం అయినందున, ప్రత్యేక అభిషేకాలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.