సమాచార భారతి ఆధ్వర్యంలో నారద మహర్షి జయంతి వేడుకలు.
కరీంనగర్ అక్షిత బ్యూరో
కరీంనగర్ సమాచార భారతి ఆధ్వర్యంలో శనివారం దేవర్షి నారద మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ ప్రచార ప్రముక్ తడిగొప్పుల శంకరయ్య జి ముందుగ చిత్రపట నారద మహర్షి చిత్రపటర పూలమాలలు వేసి మాట్లాడారు. మే 2 (వైశాఖ జేష్ట కృష్ణ పక్ష ప్రతిపద) న నారద జయంతిని ఆర్ఎస్ఎస్, విశ్వసంవాద కేంద్రం పాత్రికేయుల దినోత్సవం గా జరుపుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా ముల్లోకాలను సంచరించి సమాచార వ్యాప్తి కోసం పనిచేసిన మొట్టమొదటి పాత్రికేయుడు నారద మహర్షి అని కొనియాడారు. నారదుడు సమాచారాన్ని ముఖ్యంగా లోక కళ్యాణం కోసం ఒక చోట నుండి మరొక చోటికి చేరవేసేవారని, ఈ నేపథ్యంలో వార్తలను సత్య నిష్ఠతో అందించే పాత్రికేయులకు ఆయనను ఆదర్శంగా భావిస్తారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. ముఖ్యంగా పంచ పరివర్తన్ విషయాలను సమాజంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుందని వివరించారు. అలాగే దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బాధ్యులు గీకురిశ్రీనివాస్, వేణుగోపాల్ , గజ్జెల హరికాంత్ లతోపాటు పలువురు ప్రాతికేయలు పాల్గొన్నారు.