మండల వ్యాప్తంగా అకాల వర్షానికి తడిసి ముద్దయిన వరి ధాన్యం…

మండల వ్యాప్తంగా అకాల వర్షానికి తడిసి ముద్దయిన వరి ధాన్యం…

 లోకేశ్వరం,అక్షిత న్యూస్:

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో కురిసిన వర్షానికి కల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది.కష్టపడి పండించిన పంట చేతికి వచ్చి విక్రయించే సమయానికి.అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో భారీగా ఈదురుగాలులు,ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది.రైతులు వడ్లపై కవర్లు(పరదాలు) కప్పినప్పటికీ పలుచోట్ల కల్లాల్లో వర్షపు నీరు నిలవడంతో ధాన్యమంతా తడిసి ముద్దయింది.త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలోని కల్లాల్లో కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొట్టుకు పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ఇకనైనా తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking