రోడ్డును కమ్మేసిన పొగ
నల్గొండ అక్షిత ప్రతినిధి
శనివారం తెల్లవారుజామున నల్లగొండ-చందనపల్లి రోడ్డుపై డంపింగ్ యార్డ్తో చెత్తను కాల్చడం వల్ల ఏర్పడిన దట్టమైన పొగతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగ రోడ్డును కమ్మేయడంతో వాహనాలు నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది, ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. చందనపల్లి గ్రామస్తులు పొగ కారణంగా శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.