*ప్రజా సంకల్పదీక్షకు కాంగ్రెస్ శ్రేణులు కదిలి రావాలి* *
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్*
కొమురవెల్లి, అక్షిత న్యూస్:
చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 30వ తేదీన జరిగే ప్రజాసంకల్ప దీక్ష కొమురవెల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదలి వచ్చి ప్రజా సంకల్ప దీక్షను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కొమరవెల్లి మండలాధ్యక్షుడు మహ దేవుని శ్రీనివాస్ కోరారు. ఆదివారం రోజున కార్యకర్తల సమావేశంలో మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ చేర్యాల ప్రాంత అస్తిత్వం ఇక్కడి చేర్యాల ప్రాంత ఉనికి ఆత్మగౌరవంకోసంచేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని ఇక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేరి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన అన్నారు.గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న ఒక్కనాడు కూడా పోరాటంలో మద్దతు ఇవ్వకుండా ఈరోజు కపట నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు.నాడు ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి పెద్ద ఎత్తున చేర్యాల డివిజన్ కోసం ఉద్యమాన్ని నిరుగార్చె ప్రయత్నం చేశారే కానీ ఒక్కరోజు కూడా అసెంబ్లీలో చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని మాట కూడా ఎత్తలేదని ఆయన అన్నారు. అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పటి ప్రస్తుత ఎమ్మెల్యే నాడు ఒక్కరోజు కూడా సంఘీభావం తెలపని ఎమ్మెల్యే ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ కపటనాటకాలుఆడుతున్నాని అన్నారు. మన ప్రియతమ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం తన ప్రయత్నం తాను కూడా చేస్తున్నాడని ప్రతాప్ రెడ్డినాయకత్వంలో డివిజన్ ఏర్పాటు అవుతుందని అన్నారు,ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుని హోదాలో మన ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించితీరుతాడనిఅన్నారు జేఏసీ ఆధ్వర్యంలో 30వ తేదీన ప్రజా సంకల్ప దీక్షకు కొమురవెల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు అందరూ పాల్గొని ప్రజాసంకల్ప దీక్ష విజయవంతం చేయాలని మహాదేవుని శ్రీనివాస్ కోరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సనాదిభాస్కర్,ఉపాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్,చెరుకు రమణారెడ్డి,లింగంపల్లి కనకరాజు,మల్లంబాలయ్య, సార్లలింగం, జంగని రవి, మేడికుంట శ్రీనివాస్,గణేష్ గౌడ్,పరుశరాములు,ఏర్పుల రాజు, ఉప్పల వంశీ,తదితరులు పాల్గొన్నారు